ప్రపంచ దేశాలు కరోనా ధాటికి అట్టుడికిపోతున్నాయి. అతి చిన్న వైరస్, మనుషులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇది నిన్న స్పెయిన్ లో 832 మందిని పొట్టన పెట్టుకుంది. ఇక అమెరికా... ఐరోపా దేశాల్లో... కోవిడ్-19 కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇక పొతే.. వైరస్ తీవ్రత ఎక్కువగా వుంది అనుకున్న ఇటలీలో నిన్నటినుండి కాస్త కుదుట పడినట్లు కనబడుతోంది.

 

కరోనా నుండి మన భారతదేశ స్థితి గతులను చక్క బెట్టేందుకు పలువురు ప్రముఖులు దాతలుగా ముందుకొచ్చి, పెద్ద మొత్తాలలో విరాళాలు ప్రకటిస్తున్నారు. కరోనా కట్టడికి టాటా సంస్థ ఇటీవల 1500 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసినదే. అలాగే... బాలీవుడ్ నుండి.. సింగ్ ఈజ్ కింగ్ అక్షయ్ కుమార్ 25 కోట్ల విరాళాన్ని ప్రకటించి తన ఉదారతను చాటుకున్నాడు. అలాగే... మన టాలీవుడ్ నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2 విరాళం ఇచ్చి... పలువురికి స్ఫూర్తిగా నిలిచిన సంగతి తెలిసినదే.

 

ప్రపంచ వ్యాప్తంగా బాధితుల సంఖ్యను ఒకసారి పరిశీలించినట్లయితే.. 680453 మందికి కరోనా సోకగా... 31912 మందిని కరోనా బలి తీసుకుంది. 146352 మంది బాధితులు.. కరోనా నుండి బయట పడినట్లు తెలుస్తోంది. తీవ్రత ఎక్కువగా వున్న దేశాలైన ఇటలీలో 92472 ; ఇరాన్ లో 38309 ; అమెరికాలో 113677 కేసులు నమోదు అయ్యాయి. ఇండియాలో 987 మందికి, సోకగా... వారిలో 26 మంది చనిపోయారు, ఇందులో 87 మంది సేఫ్ గా బయట పడినట్లు ప్రస్తుత సమాచారం. ఇక మన ఆంధ్ర, తెలంగాణ  రాష్ట్రాల సంఖ్యను చూస్తే.. ఇప్పటికి 86 మంది కరోనా బారిన పడగా... తెలంగాణాలో ఒక్కరు మరణించారు. ఆంధ్రాలో 19 తెలంగాణాలో 67 కేసులు వున్నాయి.

 

మన ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రులైన జగన్ మోహన్ రెడ్డి గారు... కెసిఆర్ గారు సంయుక్తంగా కలిసి... లాక్ డౌన్ ని సక్సెస్ దిశగా నడిపించడం హర్షించదగ్గ విషయం. ఇప్పటికే మన ఆంధ్రా ప్రజలు హైదరాబాద్ లో చిక్కుకోగా... వారు అక్కడినుండి రావాలని ప్రయత్నించినప్పటికీ... ప్రస్తుత పరిస్థితుల వలన వారిని వారించి అక్కడే ఉంచారు. పరిస్థితి కొంచెం సద్దుమణిగాక వారి ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తారని వినిపిస్తోంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple: https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: