ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం జిల్లా కరోనా కోరాల్లో చిక్కుకుందా...? ఆ జిల్లాను కొందరు వ్యక్తులు కరోనాలో ముంచేసారా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ప్రకాశం జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు ఇటీవల ఇతర రాష్ట్రాలకు వెళ్లి వచ్చారు. వాళ్ళు అందరూ కూడా ఒంగోలు, చీరాల రైల్వే స్టేషన్లలో దిగారు. ప్రకాశం జిల్లా నుండి ఢిల్లీ ఇస్థిమా కి వెళ్ళింది 280 మంది అని అధికారులు ఆధారాలతో సహా గుర్తించారు. 

 

అందులో 200 మంది ఒంగోలు స్టేషన్ లో..80 మంది చీరాల స్టేషన్ లో దిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వీళ్లంతా జిల్లాల్లో వివిధ ప్రాంతాలకి చెందినవారుగా అంచనా వేస్తున్నారు అధికారులు. గత కొన్ని రోజులుగా రోజువారీ పనుల్లో భాగంగా సాధారణ ప్రజల్లానే అందరిలో తిరుగుతున్నారు వీరు అందరూ. ఈ సమాచారం అందుకున్న ప్రకాశం జిల్లా యంత్రాంగం వారి జాబితాను గుర్తించే పనిలో పడింది. ఎవరు ఎక్కడ ఉన్నారు అనే దానిని అధికారులు ఆరా తీస్తున్నారు. 

 

ఏయే ప్రాంతాలకు చెందిన వారు వెళ్ళారు...? ఏయే ప్రాంతాలకు వచ్చారు...? వారు ఎక్కడ తిరిగారు అనేది ఇప్పుడు అధికారులకు అర్ధం కాకుండా ఉంది. ప్రకాశం జిల్లాలో రెండు కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ రెండు కేసులు కూడా అలా నమోదు అయినవే కావడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. వీరిలో ఎవరైనా వేరే జిల్లాలకు వెళ్లి వచ్చారా అనేది అర్ధం కావడం లేదు. జిల్లాకు చెందిన వాళ్ళు ఎక్కువగా గుంటూరు, కర్నూలు జిల్లాలకు తిరుగుతూ ఉంటారు. వ్యాపార నిమిత్తం ఎక్కువగా ఆయా ప్రాంతాలకు వీళ్ళు వెళ్తూ ఉంటారు. ఇలా ఎవరిని అయినా ఎక్కువగా కలిసారా లేదా అనేది అర్ధం కావడం లేదు. ప్రస్తుతం కరోనా బాధితుల కుటుంబాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు అధికారులు. వారు ఎక్కడ ఎక్కడ తిరిగారు అనే దాని మీద ఎక్కువగా ఆరా తీస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: