కరోనా వైరస్(కోవిడ్‌-19).. ఈ పేరు వింటేనే అందరి గుండెల్లో గుబులు రేగుతోంది. ఇప్పటికే ఈ ర‌క్క‌సి క‌రోనా వైర‌స్‌ బారిన పడి ప్రపంచవ్యాప్తంగా 30 వేల మందికిపైగా మృత్యువాత పడ్డారు. ఇక 6 లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. ఇక భారత్‌లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్‌లో 21 రోజులపాటు లాక్‌డౌన్ ప్రకటించింది. అయినప్పటికీ కరోనా పాజిటివ్ కేసుల నమోదు ఆగడంలేదు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 1,000 మార్క్‌ను దాటేసింది. 

 

ఇండియాలో కరోనా వైరస్ సోకి ఇప్పటి వరకు 25 మంది మృతి చెందినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. అయితే క‌రోనా క‌ట్ట‌డికి వీర‌మాచినేని స‌ల‌హాలు ఇస్తున్నారు. వీరమాచినేని రామకృష్ణారావు.. ఇటీవ‌ల‌ కాలంలో ఆరోగ్య నియమాలు చెప్పడంలో, స్థూలకాయాన్ని తగ్గించడంలో అందుకు తగ్గ సలహాలు చెప్పడంలో బాగా ప్రాచుర్యం పొందిన వ్యక్తి. వీరమాచినేని సలహాలు పాటించిన ఎంతో మంది స్థూలకాయులు బరువు తగ్గినా సంఘటనలు అనేకం ఉన్నాయి. అలాగే జనాల్లో సైతం వీర‌మాచినేని డైట్ ప్లానింగ్ పై ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది. 

 

పెద్ద ఎత్తున వీరమాచినేని డైట్ ప్లానింగ్ కు మద్దతు లభిస్తోంది. ఇక తాజాగా ఆయ‌న ఇచ్చిన స‌ల‌హాలు క‌రోనా వైర‌స్‌ను త‌గ్గిస్తుంద‌ని కాకుండా.. రోగ నిరోధ‌క‌శ‌క్తిని పెంచుకోవ‌డానికి ఉప‌యోగ‌పడ‌తాయంటున్నారు. వైర‌స్‌తో పోరాడ‌డానికి రోగ నిరోధ‌క శ‌క్తి ఎంత అవ‌స‌ర‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ నేప‌థ్యంలోనే ముందుగా వేడి నీటిని కంటిన్యూగా వాడండి. అంటే తాగ‌డానికి, చేతులు క‌డ‌గ‌డానికి, స్నానానికి ఇలా అన్నిటికీ వేడి నీటినే కాస్త వేడిగా ఉన్న‌ప్పుడే ఉప‌యోగించండి. 

 

అలాగే చైనాలో మ‌రియు ఇత‌రిత‌ర దేశాల్లో మృతి చెందుతున్న వారిలో ఎక్కువ‌గా లంగ్స్ దెబ్బ‌తింటున్నాయి. కాబ‌ట్టి సెగ‌రెట్‌కు దూరంగా ఉంటే మంచిదంటున్నారు. మ‌రియు ఇంట్లో ఉన్న టైమ్‌లో వెల్లుల్లి పేస్ట్‌, అల్లం పేస్ట్, పాల కూర పేస్ట్ నీటిలో మ‌ర‌గ‌బెట్టుకుని తాగ‌డం వ‌ల్ల రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరిగి క‌రోనాతో పోరాడ‌గ‌లమ‌ని ఆయ‌న అంటున్నారు. ఇవే కాకుండా మీ యాంగిల్‌లో మీరు రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌డానికి ట్రై చేయండి. అలాగే సాధ్య‌మైనంత వ‌ర‌కూ బ‌య‌ట‌కు రాకుండా ఉండండి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: