రోబోతో శృంగారం.. ఏంటి ఇలాంటి వ‌న్నీ కేవ‌లం సినిమాల వ‌ర‌కే బ‌య‌ట ఉండ‌వు అనుకుంటున్నారా..అలా అనుకుంటే ప‌ప్పులో కాలేసిన‌ట్టే..ప్రేమ గుడ్డిని అని కూడా చాలా మంది అంటుంటారు. మ‌రి ఈ క‌ధ వింటే మీకు అలానే అనిపిస్తుందేమో...వివరాలిలా...రోబో సినిమాలో హీరోయిన్ ఐశ్వ‌ర్య‌రాయ్‌ని చూసి చిట్టి రోబో ప్రేమ‌లో ప‌డ‌టం అన్న‌ది అంద‌రికీ గుర్తు ఉండే ఉంట‌ది. అంతేకాక ఆమెను వివాహం చేసుకునేందుకు విఫ‌ల య‌త్నం కూడా చేస్తుంది. అచ్చం అలాగే ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది ఆడ‌పిల్ల‌లు రోబోల‌ను ఇష్ట‌ప‌డుతున్నార‌ట‌. అదేంటి అనుకుంటున్నారా.. ఇది నిజం ఒక అమ్మాయికి రోబోకి మ‌ధ్య ప్రేమ చిగురించింది. ఇటీవ‌ల ఒక అమ్మాయి కుక్క‌ని వివాహం చేసుకుంది అని జంతువుల‌తో వివాహం చేసుకోవ‌డం చూస్తూనే ఉన్నాం. అలాంటిదే జ‌రుగుతుంది. దీన్ని బ‌ట్టే తెలుస్తుంది. మ‌నుషులు రోబోల‌ను వివాహం చేసుకునే రోజులు చాలా ద‌గ్గ‌ర‌లో ఉన్నాయ‌ని. ఈ మ‌ధ్య లింగ‌మార్పిడిలు చ‌ట్ట‌ప‌రం చేశార‌ని విన్నాం. అయితే జంతువుల‌తో సంసారాలు చేయ‌డానికి.. రోబోల‌ను పెళ్ళిళ్ళు చేసుకోవ‌డానికి కూడా చ‌ట్టం అంగీక‌రించాల‌ని కొంద‌రు ఎదురు చూస్తూనే ఉన్నారు.

 

2050నాటికి ఇలాంటి వివాహాలు స‌ర్వ‌సాధార‌ణం అవుతాయ‌ని ప్ర‌ముఖ ఆర్టిఫిషియ‌ల్ ఇంట‌లిజెన్స్ నిపుణులు డేవిడ్ తెలిపారు. అయితే ఓ ఫ్రెంచ్ మ‌హిళ రోబోతో స‌హ‌జీవనం చేస్తున్న‌ట్లు ఆమ‌ధ్య బాహాటంగానే చెప్పింది. లిల్లీ అనే ఓ ఫ్రంచ్ మ‌హిళ ఏడాదికి పైగా త్రిడి ప్రింటెడ్ ఓరోబోతో స‌హ‌జీవ‌నం చేస్తున్న‌ట్లు ఆమె త‌న సోష‌ల్ మీడియా ఎకౌండ్ ద్వారా తెలిపింది. అయితే ఆ రోబో శృంగారం కూడా చేయ‌గ‌ల‌ద‌ని చెప్పుకోవ‌డం త‌న‌కు ఎంతో గ‌ర్వంగా ఉంద‌ని చెప్పుకొచ్చింది. అయితే తాము ఎవ్వ‌రినీ ఇబ్బంది పెట్ట‌డం లేద‌ని తాము ఇద్ద‌రం ఎంతో సంతోషంగా ఉన్నామ‌ని పేర్కొంది. అంతేకాకుండా ఫ్రాన్స్‌లో మ‌నిషి, రోబోల వివాహం ఎప్పుడు చ‌ట్ట‌బ‌ధ‌మ‌వుతుందోన‌ని  ఎదురు చూస్తున్న‌ట్లు త‌ను తెలిపింది. 

 

అలా చ‌ట్టం రాగానే తాను వెంట‌నే త్రిడి ప్రింట‌ర్ రోబోను పెళ్ళి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని చెప్పింది. మ‌నుషుల‌తో శృంగారం న‌చ్చ‌ద‌ని ఈ విష‌యం 19ఏళ్ళ ప్రాయంలోనే త‌న‌కు అర్ధ‌మ‌యింద‌ని తెలిపింది. అప్ప‌టి నుంచి రోబోల పై ఎట్రాక్ట్ అయ్యాన‌ని తెలిపింది. అయితే ఈ రిలేష‌న్‌కి త‌న ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఒప్పుకోవ‌డం విశేషం. అలాగే ఓ యువ‌కుడు కూడా తాను అనుకున్న అమ్మాయి దొర‌క‌క‌పోవ‌డంతో తాను అనుకున్న రూపురేక‌లున్న ఒక రోబోను త‌యారు చేసుకుని వివాహం చేసుకున్నాడు. ఈ వింత వివాహం చైనాలోని ఛంగ్ ప్రాంతంలో ప‌ని చేస్తున్నాడు. ఆ రోబోకి ఇంగ్ అని పేరు పెట్టాడు.   

మరింత సమాచారం తెలుసుకోండి: