టీడీపీ తమ్ముళ్ళకు రాజకీయ సూత్రాలు బాగా వంటబడతాయి. ఆ లెక్కలు కట్టడం బాగా వచ్చు. ఏది కలిపితే రెట్టింపు వస్తుందో. ఏది హెచ్చిస్తే చచ్చేంటంత ముప్పు వస్తుందో అధినేత చంద్రబాబు గణితం బాగా నేర్పించారు. దాంతో బాబుతో పాటు తమ్ముళ్ళు కూడా ఇపుడు పొలిటికల్ మాధమెటిక్స్ లో పండిపోయారు.

 

రాజకీయాల్లో పెద్ద శత్రువు, దగ్గర  శ‌త్రువు, దూరం శత్రువు. ఇలా విభజించి పోరాటం చేయడం టీడీపీకి బాగా తెలుసు. తెలంగాణాలో కాళ్ళూ చేతులూ ఎత్తసిన టీడీపీకి కేసీయార్ కూడా ఇపుడు మంచిగానే కనిపిస్తున్నారు. ఆయనని జగన్ నుంచి మైనస్ చేస్తే టీడీపీకి ప్లస్. అదే ఇపుడు కావాల్సింది కూడా.

 

అందుకే కేసీయార్ని బాగా పొగుడుతున్నారు. కేసీయార్ని బాబు నేరుగా పొగడలేక అనుంగు తమ్ముళ్ళతో పొగిడిస్తున్నారు. మాజీ మంత్రి reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కేసీయార్ని రాజకీయ ప్రత్యర్ధి అని సన్నగా అంటూనే  ఆయన బాగా కరోనా వైరస్ ని కట్టడి చేయడంలో పోరాడుతున్నారని కితాబు ఇచ్చారు. కేసీయార్ని చూసి అంతా నేర్చుకోవాలంటూ జగన్ కి సెటైర్లు వేశారు.

 

హైదరాబాద్ లో ఎక్కువ కేసులు ఉన్నాయి. ఒక మరణం కూడా అక్కడ రికార్డు అయింది.  ఇక ఏపీలో కేసుల తాకిడి పెద్దగా లేదు. ఒక్క మరణం రికార్డు కాలేదు. వాలంటీర్ల వ్యవస్థ బాగుందని కేరళ సీఎంతో పాటు బ్రిటన్ లో కూడా అమలు చేస్తున్నారు. అయినా టీడీపీ తమ్ముళ్ళ కళ్ళకు అసలు కనిపించడంలేదు. ఎందుకంటే వారికి ఉన్న రాజకీయ మంటే ప్రధాన  కారణం అంటున్నారు.

 

ఇక మోడీని పొగుడుతూ బాగు పేజీలకు పేజీలు ప్రేమ‌ లేఖలు రాస్తున్నారు. కానీ పేదలకు రేషన్ ముందే ఇస్తూ వేయి రూపాయలు ఇస్తున్న  జగన్ని మాత్రం కనీసమాత్రంగా మెచ్చుకోవడంలేదు. ఏంటిదంతా అంటే అది అంతే. వారికి కరోనా కంటే జగన్ శత్రువులా కనిపిస్తున్నారనుకోవాలి. ఏపీలో కరోనా కేసులు ఎక్కువగా లేవు కానీ ఒకవేళ ఉంటే కనుక  తమ్ముళ్ళ వీరంగాలు, పూనకాలు ఒక్క లెక్కలో ఉండేవిగా. ఏమైనా కరోనా వచ్చినా కరడు కట్టిన రాజకీయం మాత్రం మారలేదుగా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: