దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కఠిన చర్యలు తీసుకుంటున్నారు.  కానీ ప్రజలను మాత్రం కొన్ని చోట్ల కంట్రోల్ చేయలేకపోతున్నారు.  కరోనా వల్ల లాక్ డౌన్ చేపట్టిన విషయం తెలిసిందే.  తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభ్తుం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు.  ఈ నేపథ్యంలో  ఆదివారం రోజే సీఎం కేసీఆర్‌ మూడుసార్లు సమీక్షలు నిర్వహించి అధికారులను అప్రమత్తం చేశారని అన్నారు.

 

ఇతర  రాష్ట్రాల నుంచి వచ్చిన వారి సమాచారం కూడా అందించాలని అన్నారు. పాజిటివ్‌ వచ్చిన వారికి ట్రీట్‌మెంట్‌ జరుగుతోందన్నారు. ఏ హాస్పిటల్‌లో ఎలాంటి సమస్యలు లేవన్నారు.  కరోనా పై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇలాంటివి ప్రజల్లో ఆందోళన కలిగిస్తుందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 67 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపారు. మరో ఆరు రోజుల్లో గచ్చిబౌలిలో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో ఆరు ఫ్లోర్‌లు రెడీ అవుతాయని అన్నారు. ఇందులో 1500 బెడ్స్‌ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.ప్రార్ధనా మందిరాల్లోకి వెళ్లి ఇబ్బంది పడొద్దని, ఇంటి దగ్గర ప్రార్ధనలు చేసుకోవాలన్నారు.

 

వైద్యులు, ఎయిర్‌పోర్ట్‌లోని స్ర్కీనింగ్‌లో పనిచేసే సిబ్వంది నలుగురికి కరోనా సోకింది. వారి కుటుంబాలకు పరీక్షలు చేస్తున్నట్టుచెప్పారు. రోగుల దగ్గర పనిచేసే సిబ్బంది ఎప్పటికప్పుడు చెక్‌చేసుకోవాలని మంత్రి సూచించారు. వైద్యులకు అవసరమైతే పది రోజులు విధులు, మరో పది రోజులు లీవ్‌ ఇస్తామని తెలిపారు. 65 మంది పాజిటివ్‌ వ్యక్తుల్లో పది మంది రోజగులకు నెగిటివ్‌ వచ్చింది. రేపు మరోసారి పరీక్ష చేసి డిశ్చార్చి చేస్తామని అన్నారు. 

 

 కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: