ప్రస్తుత పరిస్థితులలో EPF వున్నవారు అదృష్టవంతులే అని చెప్పాలి. ఈ కరోనా కష్టకాలంలో... PF  డబ్బులు, సదరు ఉద్యోగులకు కొంత మేరకు సాంత్వనను చేకూరుస్తాయనే చెప్పుకోవాలి. ఇపుడు నెలకొన్న గడ్డు కాలంలో మోదీ సర్కార్, ఉద్యోగులను దృష్టిలో ఉంచుకొని పీఎఫ్ విత్‌డ్రా రూల్స్‌ను , కొంచెం సవరించింది. దీంతో PF ఖాతా కలిగిన సదరు మెంబర్లు నాన్ రిఫండబుల్ అడ్వాన్స్‌ మొత్తాన్ని చాలా ఈజీగా విత్‌డ్రా చేసుకోవచ్చు. 

 

అందులోనూ, ఇక్కడ సంతోషించ దగ్గ విషయం ఏమిటంటే... 3 రోజుల్లోనే ఆ మొత్తం సొమ్ము, మీ అకౌంట్‌కు వచ్చేస్తుంది. EPFO ఇప్పటికే ఈ అంశానికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేయడం గమనార్హం. అలాగే, దీనికి సంబంధిన విత్‌డ్రా అప్లికేషన్లు.. వేటినైనా విత్‌డ్రా చేసుకొనే వెసులుబాటు కల్పిస్తోంది. ఇక కొత్త నిబంధనల ప్రకారం.. అమౌంట్‌లో దాదాపుగా 75 శాతం అమౌంట్ ను ఒకేసారి డ్రా చేసుకోవచ్చు.

 

అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే.. మాములుగా మనం పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా కొరకు దరఖాస్తు చేసేటప్పుడు సదరు ఫారంలో ఏదో ఒక కారణం తెలియజేయాలి.. అలాగే అది పీఎఫ్ రూల్స్‌కు అనువుగా ఉంటేనే.. మన PF డబ్బు మనకు కన్ఫర్మ్ అవుతుంది. కానీ, తాజా మార్పులు వలన, మనం వైద్యం, పిల్లల చదువు, ఇంటి నిర్మాణం, కొత్త ఇల్లు కొనుగోలు, పెళ్లి వంటి కారణాలు టిక్ చేయాల్సిన  అవసరం లేకుండానే నేరుగా పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు.

 

అయితే వాటి స్థానంలో కరోనా ఆప్షన్ ఎంచుకుంటే సరిపోతుంది. ఇక 75 శాతం విత్‌డ్రా అమౌంట్ మీ సొంతం. అయితే ఈ కొత్త రూల్స్ కేంద్ర ప్రభుత్వం నిన్నటినుండే.. అంటే మార్చి 28 నుంచే అమలులోకి తెచ్చింది. ఇక ఈ వెసులుబాటుని సదరు ఉద్యోగులు ఉపయోగించుకోవాలని మోడీ ప్రభుత్వం సూచించింది. అలాగే మనం దరఖాస్తు చేసుకున్న కొన్ని గంటల్లోనే.. జెట్ స్పీడుగా డబ్బులు మొత్తం మన అకౌంట్‌కు వచ్చేస్తాయి. రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేనేలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: