భారత్ లో కరోనా శరవేగంగా వ్యాపిస్తోంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. దీని వేగాన్ని అడ్డుకోలేకపోతున్నాం. అయితే ప్రపంచంతో పోల్చుకుంటే.. ఇండియా విషయం కాస్త సానుకూలంగానే ఉన్నట్టు చెప్పుకోవాలి. అయితే ఇండియాలోని ఓ రెండు రాష్ట్రాలు మాత్రం దడ పుట్టిస్తున్నాయి. అవే కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాలు.

 

 

తాజాగా కేరళలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 200 దాటేసింది. తాజాగా ఈ రాష్ట్రంలో మరో 20 పాజిటవ్ కేసులు నమోదయ్యాయి. మరో విషయం ఏంటంటే... 20 పాజిటివ్ కేసుల్లో 18 మందికి విదేశాలకు వెళ్లి వచ్చిన చరిత్ర ఉంది. మరో రెండు కేసులు వారి ద్వారా స్థానికులకు సోకిన కేసులు. దీంతో కేరళలో మొత్తం కేసుల సంఖ్య 202కు చేరుకుంది. అయితే వీటిలో 181 మాత్రమే యాక్టివ్ కేసులు. అంటే ఇంకా జబ్బుతో బాధపడుతున్నవారు.

 

 

మిగిలిన వారు కోలుకుని ఇళ్లకు వెళ్లిపోయినవారు. ఈరోజు కరోనా పాజిటివ్ వచ్చిన వారి వివరాలు ఇలా ఉంటే... మరో నలుగురికి నెగిటివ్ వచ్చింది. అయితే కేరళలో కరోనా కట్టడి కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అంతటా మంచి స్పందన వస్తోంది. అసలు మన దేశంలో కరోనా అడుగు పెట్టిందే కేరళ రాష్ట్రం నుంచే. చాలా రోజుల క్రితమే ఇక్కడ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.

 

 

అయితే కేరళ ప్రభుత్వం మాత్రం పాజిటివ్ కేసులు వచ్చిన వారికి చికిత్స అందించడంలోనూ... లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్నవారికి సాయం చేయడంలోనూ తగిన చర్యలు తీసుకుంటోంది. చాలా రాష్ట్రాలు ఇప్పుడు కేరళ మోడల్ ను ఫాలో అవుతున్నాయి. మొదట కరోనా పాజిటివ్ కేసులు నమోదైన వెంటనే కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: