క‌రోనాను జయించిన యువ‌కుడు ప్ర‌ధాని మోదీ మ‌న‌సు చూర‌గొన్నాడు. క‌రోనా జ‌యించ‌డంలో మ‌నోధైర్యం అనేది ఎంతో ముఖ్య‌మ‌ని చెప్పిన ఆ పాజిటివ్ దృక్ప‌థం క‌లిగి యువ‌కుడితో మ‌న్‌కీ బాత్‌లో ప్ర‌ధాని మోదీ ఎంతో ఇష్టంగా మాట్లాడారు.  ఆ యువ‌కుడు కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్య‌క్తి కావ‌డం మ‌రో విశేషం. ఆదివారం ప్ర‌ధాని మోదీ ఆలిండియా రేడియోలో మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా  సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్‌కు చెందిన  సురేశ్ (పేరు మార్చాం) తో మాట్లాడారు. చాలా రోజుల క్రితం నుంచి తీవ్ర అనారోగ్యానికి గురైన సురేష్ క‌రోనా ల‌క్ష‌ణాల‌తో గాంధీ ఆస్ప‌త్రిలో చేరాడు. అడ్మిట్ నాలుగోరోజూ క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. దీంతో వైద్యులు గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచారు. 

 

అయితే క‌రోనా గురించి వైద్యుల్లోనే తీవ్ర‌మైన కంగారు నెల‌కొన్న స‌మ‌యంలో ఆ యువ‌కుడు డాక్ట‌ర్ల‌కే మ‌నోధైర్యాన్ని పెంచాయ‌ట‌.  మీపై నాకు పూర్తి న‌మ్మకం ఉంది. నాకు వ‌చ్చింది పెద్ద రోగ‌మేమీ కాద‌ని నేను భావిస్తున్నా. మీ ప్ర‌య‌త్నం మీరు చేయండి..అంటూ ఐసోలేష‌న్ వార్డులో ఉన్న‌ప్ప‌టికి అలా మాట్లాడ‌టం వైద్యుల్లో ఆశ్చ‌ర్యం క‌లిగించిందంట‌. యువ‌కుడి న‌మ్మకం నిజ‌మైంది. తొంద‌ర‌లోనే కొలుకుని పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరాడు. యువ‌కుడి పాజిటివ్ దృక్ప‌థం ..అత‌ను కోలుకుని ఇంటికి చేరిన విధానం ప్ర‌ధాని మోదీ చెవిన ప‌డ్డాయ‌ట‌. అందుకే ఆ హైద‌రాబాదీ యువ‌కుడి అనుభ‌వాలు నేరుగా పంచుకోవాల‌ని భావించ‌రాట‌. మ‌న్ కీ బాత్‌లో మోదీకి ఆ యువ‌కుడికి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ వారి మాట‌ల్లోనే తెలుగులో..మీకోసం

 

మోదీ : ఎస్ సురేశ్
సురేశ్ : నమస్కారమండీ.
మోదీ : ఎవరు? సురేశ్ గారేనా మాట్లాడేది.
సురేశ్ : అవును సర్. సురేశ్‌ను మాట్లాడుతున్నాను.
మోదీ : మీరు కరోనా వైరస్ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారని విన్నాను.
సురేశ్ : అవును సార్.
మోదీ : మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పండి మీరు పెను ప్రమాదం నుంచి ఎట్లా బయటపడ్డారు. మీ అనుభవాలు వినాలనుకుంటున్నాను.
సురేశ్ : నేను ఐటీ రంగంలో పని చేసే ఉద్యోగిని. దుబాయ్ వెళ్లాల్సి వచ్చింది. తిరిగి రాగానే జ్వరంలాంటివి మొదలయ్యాయి. ఐదారు రోజులకు డాక్టర్లు గాంధీ హాస్పిటల్లో కరోనా వైరస్ పరీక్షలు జరిపారు. అప్పుడు పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత 14 రోజులకి నాకు నయమైంది. డిశ్చార్జి చేశారు.  వైరస్ సోకిన విషయం తెలియగానే ముందు చాలా భ‌యమేసింది. కానీ ఆస్పత్రిలో చేరిన తర్వాత నన్ను క్వారంటైన్లో ఉంచారని డాక్టర్లు, నర్సులు ఎంతో మంచివాళ్ళ‌ని పేర్కొన్నాడు.  మంచివాళ్ల మధ్య ఉన్న కారణంగా నాకేమీ కాదన్న నమ్మకం కుదిరింది. ఏంచేయాలో వాళ్లకి తెలుసు. తప్పనిసరిగా నాకు మెరుగవుతుంది అన్న విశ్వాసం పెరిగిందని, అదే జ‌రిగింద‌ని చెప్పాడు. సురేష్ విష‌యానికి ఎంతో సంతోషించిన మోదీ ఆరోగ్యంపై ఇక‌పై కూడా జాగ్ర‌త్త వ‌హించాల‌ని సెల‌వు తీసుకున్నాడు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: