కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంతో పెట్టి నుంచి వార్త వినబడుతున్న అది దుర్వార్త వినబడుతుంది. ఆ దేశంలో అంత మంది చనిపోయారు, ఆ ప్రాంతంలో వైరస్ దారుణంగా ఒక వ్యక్తి వల్ల వ్యాపించింది, ఆ ప్రధాని కి మరియు ఈ ప్రెసిడెంట్ కి అంటూ రకరకాల కరోనా వైరస్ వార్తలు మనుషులను టెన్షన్ పెట్టిస్తున్నాయి. ముఖ్యంగా ఇండియాలో అయితే కేంద్ర ప్రభుత్వం ముందుగానే జాగ్రత్తలు తీసుకుని షట్ డౌన్ ఏప్రిల్ 14 వరకు అమలులోకి తీసుకు రావడంతో చాలావరకు కంట్రోల్ అయినట్లు ఇచ్చే శుభవార్త ఇటువంటి పరిస్థితుల్లో వచ్చింది.

 

 

ముఖ్యంగా ఈ వైరస్ మూడో దశకు చేరుకుంటే భారతదేశం శవాల దిబ్బగా మారటం గ్యారెంటీ అని వార్తలు రాగా… ప్రజలంతా  ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. దీంతో చాలావరకు సోషల్ మీడియాలో ఇటువంటి టైప్ వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్న తరుణంలో ఐసీఎంఆర్ శాస్త్రవేత్త గంగాఖేద్కర్ క్లారిటీ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే..”దేశంలో కరోనా లక్షణాలతో ఇప్పటివరకు వచ్చిన పాజిటివ్ కేసులు అన్నీ విదేశాల నుండి వచ్చిన వారికి మాత్రమే మరియు వారి కుటుంబ సభ్యులకు మాత్రమే అని తెలిపారు. వారికి సంబంధం లేని ఇతరులకు ఇంతవరకు కరోనా వైరస్ వ్యాపించే లేదు అని కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అనడానికి ఎలాంటి ఆధారాల్లేవు.

 

కాబట్టి ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావద్దు’అని వెల్లడించారు. అంతేకాకుండా దేశంలో కరోనా కేసులను గుర్తించడానికి భారీ ఎత్తున త్వరలో ప్రైవేటు ల్యాబ్ లు ఏర్పాటు చేస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. దేశంలో వెయ్యికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా చనిపోయింది 23 మంది మాత్రమే అదికూడా వయసు పైబడిన వాళ్లు అంటూ చెప్పుకొచ్చారు. మొత్తంమీద చూసుకుంటే భారతదేశం మూడో దశకు చేరుకోలేదు అని దేశ ప్రజలంతా ఇంటికే పరిమితం కావడంతో సేఫ్ జోన్ లో ప్రస్తుతం ఉన్నామని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం విధించిన షట్ డౌన్ పాటిస్తే సరిపోతుందని చెప్పుకొచ్చారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: