ఏపీలో కరోనా మహమ్మారి బాధితుల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏపీలో 19 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే కరోనా వ్యాప్తి పెరగకుండా ఉండేందుకు జగన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. లాక్ డౌన్ పాటిస్తూనే, కరోనా పట్ల ప్రజలకు అవగాహన కలిగిస్తూ ముందుకెళుతున్నారు. అలాగే లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. అదే విధంగా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని సర్వేచేసి ఎప్పటికప్పుడు కరోనా టెస్టులు చేస్తోంది.

 

ఇక ఇటు ప్రతిపక్షాలు కూడా పెద్దగా రాజకీయాలు జోలికి పోకుండా ప్రజలకు కరోనా పట్ల అవగాహన కల్పిస్తున్నారు. కరోనా ప్రభావమైన మొదట్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు కాస్త జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసినా, ఇప్పుడు అలాంటివేమీ చేయకుండా ప్రజలకు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండటానికి సూచనలు ఇస్తున్నారు. అలాగే రాజకీయాలు పక్కనబెట్టి, ప్రభుత్వానికి సహకరించాలని చెబుతున్నారు.

 

ఇక చంద్రబాబు ఈ విధంగా ముందుకెళుతుంటే, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాత్రం, చంద్రబాబు  టార్గెట్ గానే విమర్శలు చేస్తున్నారు. బాబు...శవాల మీద పేలాలు ఏరుకునే రకం అంటూ కాస్త ఘాటుగానే మాట్లాడారు. తన రాజకీయ మనుగడ కోసం ప్రజల్ని బలిపెట్టేరకమని విమర్శించేసారు. ఇంకా లాక్ డౌన్ కంటే ముందే  చంద్రబాబు అమరావతి నుంచి హైదరాబాద్ కు వెళ్లిపోయారని చెబుతూనే... హైదరాబాద్ లో ఉంటున్న ఏపీ వారిని ఉసిగొల్పేలా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని అన్నారు.

 

అయితే విజయసాయి చేస్తున్న విమర్శలకు, బాబు ఉన్న పొజిషన్ కి లింక్ లేదు. ఆయన ఇంట్లో ఉండి ప్రజలకు కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేదుకు సలహాలు ఇస్తున్నారు. అలాగే ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండాలని, ప్రభుత్వానికి సహకరించాలని, హైదరాబాద్ నుంచి కొందరు ఏపీకి తరలివచ్చే సందర్భంలో చెప్పారు. మరి బాబు ఏమో అలా చెబుతుంటే విజయసాయిరెడ్డి ఏమో ఇలా విమర్శలు చేస్తున్నారు. ఏదేమైనా కరోనాతో బాబు కుట్రలు చేస్తున్నారని విజయసాయి చేసే విమర్శలకు పెద్దగా అర్ధం లేనట్లే కనిపిస్తోంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple  

మరింత సమాచారం తెలుసుకోండి: