కరోనా.. ఇప్పుడు ప్రపంచంలో ఈ పేరు చెబితే ఎక్కువగా భయపడుతున్న వారిలో అమెరికన్లే ఉన్నారు. ఎందుకంటే.. ఇప్పుడు అక్కడ కోరనా విజృంభిస్తోంది. అలా ఇలా కాదు.. కేసుల సంఖ్య లక్షలకు చేరుకుంది. ఈ సంఖ్య మరింత వేగంగా విస్తరిస్తోంది. మొదట్లో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఈ మహమ్మారి ఇప్పుడు అమెరికా అంతటా పాకుతోంది. ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలకంటే అమెరికాలోనే కరోనా ప్రమాదకరంగా మారుతోంది.

 

 

అసలే కరోనా విజృంభిస్తుంటే..దేశంలో లాక్ డౌన్ ప్రకటించేది లేదంటూ ట్రంప్ మొండి పట్టుదలతో ఉన్నారు. ఇలాంటి సమయంలో కరోనా కట్టడి కోసం అమెరికా ఒకే ఒక్క వ్యక్తిపై ఆశలు పెట్టుకుంది. ఇంతకీ అతను ఎవరంటే.. డాక్టర్ ఆంథొనీ ఫాచీ. కరోనావైరస్‌తో అమెరికా చేస్తున్న పోరాటంలో ఈయన ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. అసలు ఇంతకీ ఈ ఆంథోనీ ఫాచీ ఎవరు.. ఆయన చరిత్ర ఏంటి ఓసారి చూద్దాం.

 

 

ఆంథోనీ ఫాచీ.. ఓ వైద్య పరిశోధకుడు. ఈ రంగంలో ఆయనకు 50 ఏళ్ల అనుభవం ఉంది. ఆయన ఎంత టాలెంటెడో..అంతకంటే ఎక్కువగా వివాదాల్లోనూ ఉన్నారు. అయినా ఇప్పుడు ఆయనవైపే అమెరికా ఎందుకు అంత ఇంట్రస్టింగా చూస్తుందంటే.. ఆయనకు ఇలాంటి మహమ్మారి రోగాలతో పోరాడి జయించిన చరిత్ర ఉంది. 1980లలో అమెరికాలో ఎయిడ్స్ మహమ్మారి వ్యాపించిన సమయంలో దాన్ని అరికట్టేందుకు ఆయన కీలక పాత్ర పోషించారు.

 

 

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఇమ్యునాలజీ అధిపతిగా ఉన్న డాక్టర్ ఫాచీ ఇప్పుడు 79 ఏళ్ల వయసులో మరోసారి కరోనా వంటి మహమ్మారిపై పోరాటం చేస్తున్నారు. కోవిడ్-19తో అమెరికా చేస్తున్న పోరాటంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి ఎన్నో రోగాల మహమ్మారులతో పోరాటిన ఆంథోనీ.. ఈ గండం నుంచి అమెరికాను గట్టెక్కిస్తారా.. తన పోరాటంలో విజయం సాధిస్తారా.. చూడాలి. మరి ఏం జరుగుతుందో..

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: