కొరోనా వైరస్ నియంత్రణకు దేశం మొత్తం లాక్ డౌన్లోనే ఉన్నా  ప్రధానమంత్రి నరేంద్రమోడి ఊహించని రీతిలో బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. దీనికి ప్రధాన కారణం వలసలని కేంద్రం అభిప్రాయ పడింది.  దాంతో రాష్ట్రాల మధ్య, జిల్లాల మధ్య వలసలను ఎక్కడికక్కడ నిలిపేయాలంటూ తాజాగా కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది.  ఎక్కడైనా వలసలు కంటిన్యు అవుతున్నట్లు తెలిస్తే వెంటనే జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలదే బాధ్యత అని వార్నింగులు ఇవ్వటం సంచలనంగా మారింది.

 

నిజానికి వలసలు ఆగకపోవటంలో కేంద్రప్రభుత్వానికి కూడా బాధ్యతుంది. పనుల కోసం ఎక్కడెకక్కడికో వెళ్ళిన వాలస కూలీలు తిరిగి తమ స్వస్ధలాలకు చేరుకునే అవకాశం ఇవ్వకుండానే  ప్రధానమంత్రి లాక్ డౌన్ ప్రకటన అడ్డుకుంది. దాంతో ఒక ప్రాంతంవాళ్ళు ఇంకెక్కడో చిక్కుకుపోయారు. అయితే తన తప్పిదాన్నో లేకపోతే తొందరపాటు తనన్నో కేంద్రం ఒప్పుకోవటం లేదు. అందుకనే వలసలను అడ్డుకునే బాధ్యతను కలెక్టర్లు, ఎస్పీలపై పడేసింది.

 

అంటే ఇపుడు కలెక్టర్లు, ఎస్పీలు జిల్లాల సరిహద్దులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నమాట. అందుకనే వలసలను అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ వాళ్ళకు భొజన, వసతి ఏర్పాట్లు చేయాలని కేంద్రం ఆదేశించింది లేండి. ఎంత భోజన, వసతి ఏర్పాట్లు చేసినా సొంతూర్లకు దూరంగా ఎంతకాలమని ఉంటారు ? పైగా సొంతూరికి వెళ్ళిపోవాలని ఒకసారి బుర్రలో మొదలైన తర్వాత అది పురుగులాగ తిరుగుతునే ఉంటుంది. కానీ వెళ్ళటానికి ట్రాన్స్ పోర్టేషన్ సౌకర్యాలు లేదు. అందుకనే నడిచి వెళ్ళటానికి కూడా రెడీ అయిపోయారు.

 

ఎప్పుడైతే గుంపులు గుంపులుగా వలసలు మొదలయ్యాయో కొరోనా వైరస్ సమస్య పెరిగిపోతోంది. గుంపులుగా వెళ్ళే వాళ్ళల్లో  ఓ నలుగురికి సోకినా అది వందలమందికి సోకే అవకాశం ఉంది. ఈ విషయంలోనే కేంద్రంలో టెన్షన్ పెరిగిపోతోంది. వలసలను నియంత్రించకపోతే వైరస్ నియంత్రణ సాధ్యం కాదన్న ఉద్దేశ్యంతోనే కలెక్టర్లు, ఎస్పీలకు వార్నింగులిచ్చింది. కేంద్రం వార్నింగులతో సమస్య తమ కొంపమీదకు రాకుండా చూసుకోవటంలో ఇకనుండి  కలెక్టర్లు, ఎస్పీలు రెచ్చిపోతారు. మరి కేంద్రం వార్నింగులు ఎటు దారితీస్తాయో చూడాల్సిందే.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: