దాదాపు రెండు నెలల లాక్ డౌన్ తర్వాత కొరోనా వైరస్ పుట్టిల్లయిన ఊహాన్ నగరం దాదాపు బయటపడినట్లే. పోయిన సంవత్సరం డిసెంబర్లో మొట్టమొదటి కేసు ఊహాన్ లో బయటపడింది. మొదటిది బయటపడగానే రెండు రోజులకే ఏకంగా పదిహేను కేసులు బయటపడటంతో వెంటనే చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. మొదటగా ఊహాన్ నగరంతో పాటు ప్రావిన్సుకు బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా కట్ చేసేసింది. తర్వాత విమానాశ్రయాలు, రవాణా సౌకర్యాలను నిలిపేసింది. తర్వాత కమ్యూనికేషన్ లేకుండా అడ్డుకుంది. ఫైనల్ గా మొత్తం నగరాన్నే లాక్ డౌన్ చేసేసింది.

 

దాదాపు 34 రోజుల పాటు మొత్తం సిటినీ లాక్ డౌన్ చేస్తే కానీ వైరస్ అదపులోకి రాలేదు. ఈ 34 రోజుల్లో నగరంలోని దాదాపు కోటిమంది జనాలు ఎంత అవస్తలు పడ్డారో మాటల్లో చెప్పటం కష్టం. మొత్తం జనాలందరినీ ఇళ్ళల్లో వేసి బయట నుండి తాళాలు వేసినంత పనిచేసింది ప్రభుత్వం. ఎవరైనా పొరబాటున బయటకు వస్తే వెంటనే అరెస్టులు చేసి జైళ్ళల్లో వేసేసింది. అలా కొన్ని వందల మందిని ప్రభుత్వం జైళ్ళల్లో వేసేసింది.

 

కావాల్సిన నిత్యావసరాలన్నింటినీ ప్రభుత్వమే సమకూరుస్తున్నపుడు జనాలు బయటకు రావాల్సిన అవసరం ఏమిటనేది ప్రభుత్వం ప్రశ్న. ప్రశ్నవేసి ఊరుకోలేదు. చాలా కఠినంగా తన ఆదేశాలను అమల్లోకి తెచ్చింది. దాంతో కొరోనా వైరస్ కు రోడ్లపై జనాలెవరూ కనిపించలేదు. దాంతో ఏమి చేయాలో అర్ధంకాక వైరస్ ప్రపంచంలోని ఇతర దేశాల మీద పడింది.

 

సరే వైరస్ దెబ్బకు ప్రపంచదేశాలు ఎంతగా వణికిపోతున్నాయో ఎవరికీ కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మరి లాక్ డౌన్ తర్వాత ఊహాన్ లో జనాలు ఇపుడిపుడు బయటకు వస్తున్నారు. మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. సూపర్ బజార్లు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు ఇపుడిపుడే తెరుచుకుంటున్నాయి. ఊహాన్ నుండి జనాలను బయటకు వెళ్ళనీయకపోయినా బయట జనాలను మాత్రం ఊహాన్ లోకి అనుమతిస్తోంది ప్రభుత్వం. ఈ విధంగా కఠిన నిబంధనల నుండి ఊహాన్ సిటి బయటపడింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: