దేశం మొత్తం మీద లాక్ డౌన్ ప్రకటించినా కొరోనా వైరస్ మాత్రం స్పీడుగానే విస్తరిస్తోంది. ప్రభుత్వం అనుకున్నదొకటైతే క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది మరొకటి.  వైరస్ విస్తరణను అడ్డకునేందుకే ప్రభుత్వం ముందు జాగ్రత్తగా మూడు వారాల పాటు అంటే ఏప్రిల్ 14వ తేదీ వరకూ దేశం మొత్తాన్ని లాక్ డౌన్లో ఉంచింది. అయితే ప్రభుత్వం ఆశించిన ఫలితాల మాట దేవుడెరుగు ఫలితాలు రివర్సులో కనిపిస్తున్నాయి. వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి.

 

తాజా సమాచారం ప్రకారం దేశంలో వైరస్ బాధితుల సంఖ్య 1150కి దగ్గరలో ఉంది. అయితే 900 అనే వాదన కూడా ఉందిలేండి. అలాగే మరణాలు కూడా 25కి చేరుకుంది. వైరస్ నియంత్రణకు కేంద్రం తీసుకోవాల్సిన చర్యలన్నింటినీ తీసుకున్నా బాధితుల సంఖ్య పెరిగిపోతుండటమే ఆశ్చర్యంగా ఉంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే లాక్ డౌన్ 100 శాతం అమలు కాకపోవటం. అలాగే ప్రధానమంత్రి లాక్ డౌన్ ప్రకటించినపుడు వేలాదిమంది దేశంలో తమ సొంతూర్లకు దూరంగా ఎక్కడెక్కడో ఉన్నారు. తామున్న ప్రాంతాల నుండి సొంతూర్లకు వెళ్ళటానికి ట్రాన్సుపోర్టేషన్ లేకపోవటంతో వందలాదిమంది ఎక్కడివాళ్ళు అక్కడే చిక్కుకుపోయారు.  

 

అంటే ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత చర్యకు తోడు  కొందరు లాక్ డౌన్ పాటించని కారణంగా వైరస్ స్పీడుగా విస్తరిస్తోందనే అనుకోవాల్సొస్తోంది. పై కారణాలకు తోడు మరో ముఖ్యమైన కారణం కూడా ఉంది. అదేమిటంటే విదేశాల నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు వచ్చిన వాళ్ళల్లో వందల మంది జనాల్లోనే తిరుగుతున్నారు. హోం క్వారంటైన్, ఐసొలేషన్ వార్డులు, క్వారంటైన్ సెంటర్లలో చేరమని ప్రభుత్వాలు ఎంత మొత్తుకున్నా వీళ్ళు పట్టించుకోవటం లేదు.

 

ఒక్క ఏపిలోనే విదేశాల నుండి వచ్చి జనాల్లో తిరుగుతున్నవాళ్ళు 453 మంది ఉన్నారు. జనాల్లో తిరిగేస్తున్న విదేశాల నుండి వచ్చిన వాళ్ళల్లో ఎంతమందికి కొరోనా వైరస్ ఉందో  చెప్పటం కష్టం. వీళ్ళల్లో ఓ 20 మందకి వైరస్ ఉన్నా వీళ్ళ వల్ల వందలమందికి సోకటం ఖాయమే. ఇటువంటి కారణాల వల్లే వైరస్ దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: