భార‌త్‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వైర‌స్‌ను ఎదుర్కొవ‌డానికి అన్నిరంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు త‌మ‌కు తోచిన విధంగా ఆర్థిక సాయం ప్ర‌క‌టిస్తున్న విష‌యం తెలిసిందే. అదే స‌మ‌యంలో త‌మ‌కు తోచిన స‌ల‌హాలు, సూచ‌న‌లు అంద‌జేస్తూ జాతి ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇప్పుడు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ  కూడా దేశంలోని మ‌ధ్య త‌ర‌గ‌తి, పేద‌ల‌ను దృష్టిలో ఉంచుకుని స‌మాచార వ్య‌వ‌స్థ‌కు ఎక్క‌డా ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఉండేందుకు టెలికాం సంస్థ‌లు ఉచితంగా ఇన్‌క‌మింగ్ మ‌రియు అవుట్ గోయింగ్ కాల్స్‌కు సౌక‌ర్యం క‌ల్పించాల‌ని, దీనివ‌ల్ల వారికి ఎంతో ఉప‌యోగం ఉంటుంద‌ని  పేర్కొన్నారు.

 

 ఈమేర‌కు టెలీకాం కంపెనీల అధినేతలైన రిలయన్స్ జియో అధినేత ముకేశ్ అంబానీ, వోడాఫోన్-ఐడియా చైర్మన్ కుమారం మంగళం బిర్లా, బీఎస్ఎన్ఎల్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ పుర్వార్, భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్‌కు ఆమె వేర్వేరుగా లేఖలు రాశారు. ‘‘లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది వలస కూలీలు తమ ఇళ్లకు చేరుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఆకలితో, దాహంతో, వ్యాధితో పోరాటం చేస్తున్నారు. తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో మన దేశ ప్రజలకు సాయం చేయడం మన కర్తవ్యం. ఇళ్లకు వెళ్తున్నవారిలో చాలా మంది దగ్గర డబ్బులు అయిపోతున్నాయి. 

 

రీచార్జ్ చేసుకోవడం కూడా వారికి సాధ్యపడటం లేదు. దీంతో వారు తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేయడం, వారి నుంచి కాల్స్ అందుకోవడం సాధ్యం కావడం లేదని పేర్కొన్నారు. పేద‌ల క‌ష్టాల‌ను దృష్టిలో ఉంచుకుని  వచ్చే నెల రోజులపాటు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకుండా ఇన్‌కమింగ్, ఔట్ గోయింగ్ కాల్స్ అందించాలని కోరుతున్నా. వారి ముఖంలో ఉన్న భయాన్ని, అనిశ్చితిని తొలగించడానికి ఈ చర్య దోహదం చేస్తుంది’’ అంటూ లేఖ‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా టాటాగ్రూప్ రూ.,1500కోట్ల ఆర్థిక విరాళం ప్ర‌క‌టించ‌డంతో ప్ర‌ముఖులు ఒక్కోరుగా ముందుకు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా హీరో అక్ష‌య్‌కుమార్ రూ.25కోట్ల‌ను విరాళంగా ప్ర‌క‌టించారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: