మ‌న‌దేశంలో క‌రోనా దెబ్బ‌తో ఇప్ప‌టికే అంతా లాక్‌డౌన్ అయ్యింది. దేశం అంతా లాక్ డౌన్ అమ‌లు అవుతోంది. ఇక ఇప్పుడు లాక్‌డౌన్‌ సమయంలో దేశంలో పేదల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన పేరుతో రూ. 1.7 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్యాకేజీపై ర‌క‌ర‌కాల ప్ర‌శంస‌లు... అన‌క ర‌కాల విమ‌ర్శ‌లు సైతం వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే క‌రోనా వైర‌స్‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొనేందుకు కేంద్రం వైద్యులు, న‌ర్సులు, ఆశావ‌ర్క‌ర్లు, పారిశుధ్య కార్మికులు.. పారా మెడిక‌ల్ సిబ్బందికి కేంద్రం రు. 50 లక్ష‌ల ఆరోగ్య బీమా సైతం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

 

ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన నిబంధ‌న‌లు సైతం పొందు ప‌రిచింది. ఈ క్ర‌మంలోనే క‌రోనా రోగుల‌కు వైద్యం అందించే క్ర‌మంలో ఈ బాధ్య‌త‌లు ప‌ర్య‌వేక్షిస్తోన్న క‌మ్యూనిటీ హెల్త్ వ‌ర్క‌ర్ల‌తో పాటు 22.12 లక్షల మంది పబ్లిక్‌ హెల్త్‌ కేర్‌ ప్రొవైడర్లకు ఈ బీమా వర్తించనుంది. వీరు చాలా రిస్క్‌తో కూడిన విధులు నిర్వ‌హిస్తున్నారు. ఏ మాత్రం తేడా వ‌చ్చినా కూడా వీరి ప్రాణాల‌కు సైతం ప్ర‌మాదం వాటిల్లే ఛాన్సులు కూడా ఉన్నాయి. అందుకే ఈ బీమా వీరికి వ‌ర్తించేలా నిబంధ‌న‌లు రూపొందించారు. ఈ బీమా వ‌ర్తింప‌జేసే వారంద‌రికి ఇది పెద్ద రిలీఫ్ లాంటిదే.

 

మొత్తం మూడు నెల‌ల పాటు అంటే 90 రోజుల పాటు ఈ బీమా అమ‌ల్లో ఉంటుంది. దీని కింద రు. 50 ల‌క్ష‌లు అంద‌జేస్తారు. అలాగే క‌రోనా సేవ‌లు అందించే ప్రైవేటు ఆస్పత్రుల ఉద్యోగులు, రాష్ట్రాలు నియమించుకున్న అవుట్‌ సోర్స్‌ సిబ్బందితో పాటు పలు విభాగాలకు ఈ బీమా వర్తింప‌జేస్తారు. అయితే ఇందులో కొంత మెలిక కూడా ఉంది. వీరి సంఖ్య కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సూచనలకు లోబడి ఉంటుందని వెల్లడించింది. ఈ బీమా పొందే లబ్ధిదారులు.. ఇతర ఇన్సురెన్స్‌ పాలసీ చేయించుకుని ఉంటే వాటిని కూడా పొందవచ్చని తెలిపింది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: