కరోనా వైరస్ ఇప్పుడు తీవ్ర వాదులకు ఆయుధంగా మారే అవకాశాలు ఉన్నాయా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ఇప్పుడు దేశంలో లాక్ డౌన్ ఉంది. దేశం మొత్తం కూడా లాక్ డౌన్ ప్రకటించారు కాబట్టి ఎక్కడి వారు అక్కడే ఉంటున్నారు. అయితే ఇక్కడ కరోనా వైరస్ విషయంలో ఉగ్రవాదులు వ్యూహాత్మకంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వైరస్ ని పాకిస్తాన్ లో అంటించుకుని సరిహద్దుల ద్వారా భారత్ లోకి ప్రవేశించి... ఆయుధాలు లేకుండా వచ్చేసి ఇప్పుడు దాన్ని భారత సరిహద్దు గ్రామాల్లో అంటించే అవకాశాలు కనపడుతున్నాయి. 

 

చాలా వరకు ఉగ్రవాదులు ఇలాంటి ప్లాన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కరోనా వైరస్ ని కట్టడి చెయ్యడానికి భారత్ ఇప్పుడు ఎక్కువగా కష్టపడుతుంది కాని వాళ్ళు ఏదైనా ఇలాంటి ప్లాన్ చేస్తే మాత్రం మన దేశం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. చైనా సరిహద్దుల్లో ఉండే ఉగ్రవాదులు కూడా ఇలాగే చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. కరోనా వైరస్ కట్టడి కోసం మన దేశంలో ప్రజలు ఎవరిని అత్యవసరం అయితే మినహా బయటకు రానీయడం లేదు. ప్రజలు అవసరం ఉన్నప్పుడు బయటకు వచ్చిన సమయంలో ఈ వైరస్ ని విస్తరించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 

 

ఏదైనా ఇలాంటి వేషాలు వాళ్ళు వేస్తే మాత్రం భారత ప్రభుత్వం ఇబ్బంది పడటం ఖాయం. కాబట్టి ఇప్పుడు సరిహద్దుల్లో భారత ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడిక్కడ ప్రజలను కట్టడి చెయ్యాల్సిన అవసరం ఉండటం తో పాటుగా సరిహద్దుల్లో ఇంకా పహారా బలంగా ఉండే విధంగా చూడాలని అంటున్నారు. ఆయుధాలతో పని లేదు కాబట్టి వాళ్ళు ఎక్కడికి అయినా వస్తే తనిఖీలు కూడా ఉండవు. దీనితో సరిహద్దుల్లో ఉండే వాళ్లకు వైద్య పరిక్షలు చెయ్యాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: