సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రైతులకు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో కోటీ 5 లక్షల టన్నుల వరి ధాన్యం చేతికొస్తోందని... 14.5 లక్షల టన్నుల మొక్కజొన్న చేతికొస్తోందని అన్నారు. ప్రభుత్వం రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేస్తుందని చెప్పారు. రైతులకు ధాన్యం కొనుగోలుకు సంబంధిన డబ్బులను ఆన్ లైన్ ద్వారా బదిలీ చేస్తామని అన్నారు. 3,200 కోట్ల రూపాయల మార్క్ ఫెడ్ కు ఆమోదం తెలిపామని చెప్పారు. 
 
రైతులకు కూపన్లు ఇచ్చి ధాన్యం కొనుగోలు చేస్తామని సీఎం తెలిపారు. గ్రామాలలోనే ధాన్యం కొనుగోలు చేస్తామని అన్నారు. ప్రజలు ధాన్యం కేంద్రాలకు వస్తే కరోనా ప్రబలే అవకాశం ఉందని... ప్రజలు ధాన్యం కొనుగోలు గురించి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. మొక్కజొన్నకు ధర లేకపోయినా మద్దతు ధరకే కొంటామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 70 కేసులు నమోదయ్యాయని సీఎం చెప్పారు. ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకుండా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలని సూచించారు, 
 
హోం క్వారంటైన్ లో ఉన్నవారిని వైద్యులు రోజుకు రెండు సార్లు పరిశీలిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 58 మందికి చికిత్స కొనసాగుతుందని... 11 మందికి కరోనా నయమైందని అన్నారు. రేపు 11 మందిని డిశ్చార్జ్ చేస్తున్నట్లు ప్రకటన చేశారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: