కరోనా వైరస్ రోజు రోజుకు ఎలా పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కరోనా వైరస్ కారణంగా ఎంతోమంది మృతి చెందుతున్నారు. ఇప్పటికే ఈ కరోనా బారిన పడి 32వేలమంది మృతి చెందారు. ఆరు లక్షలమంది ఈ కరోనా బారిన పడి ఆస్పత్రిపాలవుతున్నారు. ప్రపంచమంతా ఈ కరోనా వైరస్ కారణంగా చిగురుటాకులా వణికిపోతుంది. 

 

ఇకపోతే ఈ కరోనా వైరస్ భారత్ లో ప్రవేశించి అతలాకుతలం చేసి పడేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ నియంత్రణకై ఏప్రిల్ 14వ తేదీ వరుకు లాక్ డౌన్ విధించింది. దీంతో ప్రజలు అంత కూడా ఇంట్లోనే ఉండాలి అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే దేశంలో అన్ని రాష్ట్రాలకంటే కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ముందు జాగ్రత్తలు తీసుకున్నారు.

 

దీంతో తెలంగాణాలో అతి త్వరగా కరోనా కేసులు తగ్గుతున్నాయి.. నిజానికి కేసులు నమోదు అయుతున్నప్పటికీ వైద్యుల శ్రమ కారణంగా అతి త్వరగా కరోనా కేసులు నెగటివ్ వస్తున్నాయ్. దీంతో ఇప్పటికే తెలంగాణాలో 11 మంది కరోనా వైరస్ ను జయించారు. అయితే ఈరోజుకు తెలంగాణాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 70కు చేరింది. 

 

అయినప్పటికీ తెలంగాణ సర్కారు ఏప్రిల్ 2వ వారంకి అంత కరోనా జయించిన రాష్ట్రం అవుతుంది అని అయన చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈ కరోనా వైరస్ బారిన పడి నష్టపోయిన ప్రజలకు.. కూలీలకు న్యాయం చేస్తాం అని చెప్పుకొచ్చారు. అంతేకాదు ప్రజల కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్నో కఠిన నిర్ణయాల కారణంగానే తెలంగాణాలో కరోనా మాయం అవుతుంది అని చెప్పచ్చు. అయినప్పటికీ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. ఏప్రిల్ 14వ తేదీ వరుకు బయటకు రాకపోవడమే మంచిది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: