దేశం మొత్తం కరోనా భయంతో వణికి పోతుంది.  ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణమృదంగం వాయిస్తుంది.  వేలల్లో మరణాలు సంబవిస్తున్నాయి.  లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా మరింత వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనాపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు.  ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 70కి చేరిందని, మరో 11 మంది కూడా చికిత్స తీసుకుని కోలుకున్నారని  ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు.

 

రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల ఎకరాల్లో పంటలు ఉన్నాయని, వాటి కొనుగోలు బాధ్యతను ప్రభుత్వమే చూసుకుంటుందని వెల్లడించారు.  మీరో ఇక రోడ్డెక్కి బండ్లు కట్టుకొని బయటకు రావాల్సిన అవసరం లేదని.. ఇప్పుడు రైతే రాజని అన్నారు.  కరోనాపై లాక్ డౌన్ అమల్లో ఉన్నందున రైతులెవరూ మార్కెట్ యార్డులకు రావొద్దని, మార్కెట్ యార్డులను మూసివేశామని తెలిపారు. అధికారులే గ్రామాలకు వచ్చి రైతుల నుంచి గిట్టుబాటు ధర ఇచ్చి పంటలు కొంటారని వివరించారు.

 

వరి, మొక్కజొన్న పంటలు పెద్ద ఎత్తున చేతికొస్తున్నాయని, ఒక్క గింజ కూడా రైతులు బయట అమ్ముకోవాల్సిన అవసరంలేదని, పైగా బయట గిట్టుబాటు ధరల్లేవని అన్నారు. దీనికి సంబంధించి రూ.3,200 కోట్ల పైచిలుకు మొత్తం మార్క్ ఫెడ్ కు గ్యారంటీ మనీగా చెల్లించామని వెల్లడించారు.  ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందుతుంది..ఇప్పుడు అన్నదాత మనకు ఎంతో అవసరం వారిని కష్టాలకు గురి చేయడం ఏమాత్రం సభ్యత కాదు అన్నారు.   రైతులకు కూపన్లు ఇస్తారని, అందులో పేర్కొన్న సమయంలో రైతు తన పంటను అమ్ముకోవచ్చని సూచించారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: