తెలంగాణాలో ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడవద్దని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేసారు. తెలంగాణాలో పండిన ప్రతీ పంటా కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల గురించి కెసిఆర్ మాట్లాడారు. రైతులకు కూపన్లు ఇచ్చి పంటలను కొనుగోలు చేస్తుందని వ్యాఖ్యానించారు. పంట మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. కోటీ 5 లక్షల వరి పంట పండింది అన్నారు. ఆ పంటను మొత్తం కొనుగోలు చేస్తామని అన్నారు. 

 

రైతులు ఎవరూ కూడా మార్కెట్ కి పంటను తీసుకుని వెళ్ళవద్దు అని కెసిఆర్ సూచించారు. ఏ ఒక్క మార్కెట్ కూడా తెరిచి లేదన్నారు. ప్రభుత్వమే గ్రామాలకు వచ్చి పంట కొనుగోలు చేస్తుందని, రైతులు పోలీసులకు అధికారులకు సహకరించాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసారు. రైతులకు కనీస మద్దతు ధర ఇచ్చి పంటలను కొనుగోలు చేస్తామన్నారు. భారీగా ఈసారి వరి పంటను పండించారు అన్నారు. రైతుల కోసం 25 వేల కోట్లు పౌర సరఫరాల శాఖకు ఇచ్చామని చెప్పుకొచ్చారు. ఈ రోజే దానికి సంతకం పెట్టామని వివరించారు. 

 

తెలంగాణాలో భారీగా ఈ సారి పంటలు పండయాని, కొనుగోలు చేసిన ప్రతీ పంటకు కూడా ఆన్లైన్ లోనే చెల్లిస్తామన్నారు. రైతులు ఒకరి మీద ఒకరు పడకుండా మూడు అడుగుల దూరం పాటించాలని సూచించారు. స్వీయ నియంత్రణ వలనే కంట్రోల్ చేయవచ్చని ఆయన అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. అయినా సరే రైతులకు అన్యాయం చేయమని హామీ ఇచ్చారు కెసిఆర్. ఇక గ్రామాల్లో రైతులు అందరూ కూడా కొనుగోలు చేయడానికి వచ్చిన వాళ్ళు ఊర్లో కి రావడానికి కంచెలు తీసి వేయాలని, గంగాళం పెట్టి రెండు సబ్బులు పెట్టి ఊర్లోకి ఎవరు వచ్చినా సరే కాళ్ళు కడుక్కుని రావాలని చెప్పాలన్నారు. కంచెలు తీసి గంగాళం పెట్టుకోమని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: