ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ తో అన్ని దేశాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో వైరస్ ను కట్టడి చేసేందుకు ఇతర దేశాలనుంచి  వచ్చిన వారిని తమ దేశాలకు రానీయకుండా చర్యలు చేపట్టారు.  కరోనా ని కట్టడి చేసేందుకు ఇప్పుడు దేశం మొత్తం లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే.  ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని కూడా నేరుగా హోం క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నారు. ముఖ్యంగా భారత దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

 


పురులియ జిల్లాలోని ఓ గ్రామానికి… తమిళనాడులోని చెన్నై నుంచి ఏడుగురు కార్మికులు వచ్చారు. అయితే లాక్ డౌన్ కొనసాగుతుండడంతోపాటు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో గ్రామంలోకి  వచ్చిన కార్మికులను అధికారులు గుర్తించారు.  దాంతో ఇంట్లో 14 రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించారు.  అక్కడ ఎలాంటి అసోలేషన్ గదుల సధుపాయం లేక పోవడంతో…వారు ఐసోలేషన్ కోసం  14 రోజుల పాటు చెట్టును నివాసంగా చేసుకున్నారు. గ్రామానికి సమీపంలోని చెట్టును ఐసోలేషన్ కేంద్రంగా మార్చుకుని కూర్చున్నారు. 

 


  గ్రామస్తుల సూచనతో ఆ ఏడుగురు కార్మికులు చెట్టు ఎక్కారు. చెట్టుపై  గుడారం ఏర్పాటు చేసుకున్నారు. చెట్టు కొమ్మలకు గుడ్డ కట్టి కూర్చోవడానికి ఏర్పాట్లు  చేసుకోగా.. వంట చేసుకోవాడానికి కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారట.  ఇదిలా ఉంటే చాలా మంది   పశ్చిమబెంగాల్  ప్రభుత్వంపై మండిపడుతున్నారు. బాధితుల కోసం ఏర్పాట్లు  చేసే తీరిక లేదా అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: