క‌రోనా క‌ట్ట‌డికి తాను ఇచ్చిన పిలుపున‌కు రాష్ట్ర ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింద‌ని సంతృప్తి వ్య‌క్తం చేశారు. ముఖ్యంగా గ్రామీణ జ‌నంలో చైత‌న్యం ఆక‌ట్టుకుంటోంద‌ని అన్నారు. తెలంగాణలో కరోనా కట్టడి, లాక్‌డౌన్, రైతుల సమస్యలు, ఇతర ఇబ్బందులపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అన్ని జిల్లాలో కలెక్టర్లు, ఎస్పీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ సత్ఫలితాలను ఇస్తోందని కేసీఆర్ వెల్లడించారు. 

 

ఈచ‌ర్య‌లు మ‌రికొన్ని రోజులు కొన‌సాగిస్తే క‌రోనా గండం విర‌గ‌డ‌యిన‌ట్లేన‌ని స్ప‌ష్టం చేశారు. వ‌రి చేతికి వ‌చ్చే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని, ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను ఊరూరా ఏర్పాటు చేసేందుకు అధికారుల‌కు ఆదేశాలివ్వ‌డం జ‌రుగుతోంద‌ని స్ప‌ష్టం చేశారు. క‌రోనా క‌ట్టుబాట్ల విష‌యంలో కొన్ని గ్రామాల ప్ర‌జ‌లు మరీ క‌ఠినంగా ఉంటున్నారని అన్నారు. కంచెలు ఏర్పాటు చేసి ఊళ్ల‌కు ఎవ‌రినీ రానియ‌డం లేద‌ని అన్నారు. ఇది స‌రైంది కాద‌ని అన్నారు. రేపు మీ ఊరిలోకి అధికారులు వ‌స్తేనేగా ధాన్యం కొనుగోలు జ‌రిగేది అంటూ హిత‌వు ప‌లికారు. జాగ్ర‌త్త‌లు ముఖ్య‌మే కాని అతిజాగ్ర‌త్త కొన్ని ఇబ్బందుల‌ను తెచ్చి పెడుతుంద‌ని అన్నారు. 

 

కంచెల‌కు బ‌దులుగా గంగాలం, స‌బ్బులు, హ్యాండ్‌వాష్‌లు లాంటివి పెట్టి క‌డుక్కున్నాకే ఇంట్లోకి రానివ్వండి..ఇది మంచి ప‌ద్ధ‌తి అవుతుంద‌ని అన్నారు.  ఆదివారం (మార్చి 29) నాటికి తెలంగాణలో 70 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా.. వీరిలో 11 మంది పూర్తిగా కోలుకున్నారని ముఖ్యమంత్రి వెల్లడించారు. అన్ని రకాల పరీక్షల అనంతరం వీరిని సోమవారం డిశ్చార్జ్ చేస్తారని తెలిపారు. ఆదివారం ఆయన ప్రధాని మోదీతోనూ మాట్లాడారని గుర్తు చేశారు. క‌రోనా బాధితుల వివ‌రాలను మేం దాచిపెట్ట ద‌ల్చుకోలేదు. ఎప్ప‌టిక‌ప్పుడు హెల్త్ బులిటెన్ విడుద‌ల చేస్తునే ఉన్నాం. ప్ర‌జ‌ల్లో క‌న్ఫ్య‌జ‌న్‌కు ఆస్కార‌మే లేద‌ని స్ప‌ష్టం చేశారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: