క‌రోనా నేప‌థ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌ల్లోకి వ‌చ్చిన నాటి నుంచి అంత‌రాష్ట్ర ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని సీఎం కేసీఆర్ అన్నారు. ఇత‌ర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం ఇక్క‌డికి వ‌చ్చిన వారిని క‌డుపులోకి పెట్టుకోవాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపైనా ఉంద‌ని అన్నారు. ద‌య చేసి వారంద‌రికీ ఉండ‌టానికి గూడు, తిన‌డానికి తిండి, తాగ‌డానికి నీరు, అవ‌స‌ర‌మైన వారికి మందులు కూడా ఇప్పించాల‌ని అధికారుల‌కు సూచించారు. ఇందుకోసం ఎంత‌ఖ‌ర్ఛ‌యినా భ‌రిద్దామంటూ వ్యాఖ్య‌నించారు. ఇక్క‌డ వాళ్లు క‌ష్టాలు ప‌డుతున్నారంటే వాళ్ల త‌ల్లులు త‌ల్ల‌డిపోతుంటారు. 

 


కాబ‌ట్టి వారిని బాగా చూసుకోవాల్సిన బాధ్య‌త మ‌న‌పై ఉంద‌ని పేర్కొన్నారు. అంత‌రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌జ‌ల‌కు మీకు నేను హామీ ఇస్తున్నా..మీరు నిశ్చింత‌గా ఉండండి. మీకు ఎలాంటి స‌మ‌స్య రాదు. అవ‌స‌ర‌మైతే అధికారుల‌ను సంప్ర‌దించండి. మీకు కావాల్సిన అన్ని సౌక‌ర్యాల‌ను వారు స‌మ‌కూరుస్తారంటూ అభ‌యం ఇచ్చారు. తెలంగాణలో కరోనా కట్టడి, లాక్‌డౌన్, రైతుల సమస్యలు, ఇతర ఇబ్బందులపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహిం చారు.  ఈ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

 

అన్ని జిల్లాలో కలెక్టర్లు, ఎస్పీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ సత్ఫలితాలను ఇస్తోందని కేసీఆర్ వెల్లడించారు. ఇక ఈ స‌మావేశంలో తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. పంట మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కేసీఆర్‌ ప్రకటించారు. ఐదారు రోజుల్లో రైతులకు కూపన్లు పంపిణీ చేస్తామని చెప్పారు. ఇప్ప‌టికే అధికారులు ఆ దిశ‌గా క‌స‌ర‌త్తు పూర్తి చేసినట్లు తెలిపారు.  తెలంగాణలో 40 లక్షల ఎకరాల్లో వరి పండుతోందని కేసీఆర్‌ అన్నారు. పౌరసరఫరాల శాఖకు రూ.25 వేల కోట్లు సమకూర్చామన్నారు. 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: