ఇతర దేశాల సంగతి ఏమో గాని మన దేశంలో మాత్రం ప్రేమికుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. చదువు రాని వాడు కూడా పుస్తక౦ పట్టుకుని కాలేజికి వెళ్ళేది, ఉద్యోగం రాని వాడు కూడా బ్యాగ్ తగిలించుకుని ఆఫీస్ లకు వెళ్ళేది ఇందుకే. గ్రామాల్లో నగర ప్రాంతాల్లో ప్రేమికులు ఇప్పుడు కరోనా దెబ్బకు బాగా ఇబ్బంది పడుతున్నారు. కాలేజీ లు లేవు, ఆఫీసులు లేవు అందరూ ఇంట్లో ఉండటమే. ఇంట్లో ఉన్న వాళ్లకు అయితే మరీ నరకంగా మారింది. అమ్మాయి అమ్మా నాన్నా ఇంట్లోనే ఉంటారు. ఫోన్ చేసుకుని మాట్లాడే పరిస్థితి దాదాపుగా ఉండే అవకాశం ఉండదు. 

 

ఫోన్ పట్టుకుంటే వేళ్ళ మీద పెట్టి కొట్టే నాన్నలు కూడా ఉన్నారు. కలవడానికి అవకాశం లేదు. బండి మీద నీట్ గా రెడీ అయి వెళ్తే ఎక్కడైనా కానిస్టేబుల్ తగిలితే అప్పడాలు, కరెంట్ తీగలు ఉంటాయి వంటి మీద. ఇప్పుడు పాపం ఎక్కడికి వెళ్ళడం లేదు. చాలా మందికి కరోనా ఇప్పుడు శోకాన్ని మిగిల్చింది. కరోన తగ్గాలని ప్రేమికులు పాపం దేవుడికి పూజలు కూడా చేసే పరిస్థితి ఇప్పుడు మన దేశంలో ఉంది. పార్క్ లు దేవాలయాలు సినిమా హాల్స్ ఇలా ఎక్కడ చూసినా సరే ప్రేమికులు మన దేశంలో ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు అన్ని చోట్లా బంద్ వాతావరణం ఉన్న నేపధ్యంలో ఎవరూ కూడా ఎక్కడా కనపడటం లేదు. 

 

కరోనా తగ్గితేనే ప్రేమించుకోవడం కుదురుతుంది. దానికి తోడు ఎండా కాలం వచ్చింది. ఎక్కడా కూడా కలిసి తిరిగే పరిస్థితి లేదు. ఇప్పట్లో కరోనా తగ్గే అవకాశం దాదాపుగా లేదు అనే చెప్పాలి. అన్ని దేశాల్లో ఇలాగే ఉంది పరిస్థితి. ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద తిరిగితే ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నారు పోలీసులు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తర్వాత ప్రేమించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: