ప్ర‌తి ప్రెస్‌మీట్‌లో మీడియా ప్ర‌తినిధులపై పంచ్‌ల వ‌ర్షం కురిపిస్తూనే ఉంటాడు. త‌న‌ను ఇర‌కాటంలో పెట్టాల‌నుకునే వారిపై కాస్త గ‌ట్టిగానే మంద‌లిస్తుండ‌టం అనేక సార్లు గ‌మ‌నించం. ఇక స‌ద‌రు రిపోర్ట‌ర్‌కు అంతంత అవ‌గాహ‌న‌తో ఉండి క్వ‌శ్చ‌న్ అడిగితే..ఇక అంతే సంగ‌తులు..ఈ మాత్రం అవ‌గాహ‌న లేకుండా ఎందుకు వ‌స్తారాయ‌..నాకు తెల్వ‌క‌డుగుతా అంటూ త‌న‌దైన శైలిలో క‌డిగేస్తారు. ఇక తాజా విష‌యానికి వ‌స్తే తెలంగాణలో కరోనా కట్టడి, లాక్‌డౌన్, రైతుల సమస్యలు, ఇతర ఇబ్బందులపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహిం చారు.  

 

ఈ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. క‌రోనా బారిన‌ప‌డిన వారి వివ‌రాలు ప్ర‌భుత్వం పూర్తిస్థాయిలో వెల్ల‌డించ‌డం లేదంటూ ఓ విలేఖ‌రి వేసిన ప్ర‌శ్న‌కు..సీఎం నీ క్వశ్ఛనడగడం పాడుగాను అంటూ త‌న‌దైన శైలిలో విరుచ‌కుప‌డ్డారు. రిపోర్టు అడిగిన విష‌యానికి సూటిగా స‌మాధానం చెప్పే ప్ర‌య‌త్నంచేశారు. ప్ర‌భుత్వం క‌రోనాకు బాధితుల‌కు సంబంధించిన ఎలాంటి విష‌యం దాచ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఆరోగ్య‌శాఖ ఎప్ప‌టిక‌ప్పుడు తాజా బులిటెన్ల‌ను విడుద‌ల చేస్తూ జ‌రుగుతున్న విష‌యాల‌ను తెలియ‌జేస్తూనే ఉంది. 

 

ఇంకా ఇందులో క‌న్ఫూజ‌న్ ఏముంది అంటూ ఏకేశారు. అయితే ప‌నిలో ప‌నిగా సోష‌ల్ మీడియాలో చాలా త‌ప్పుడు వార్త‌లు స‌ర్క్యూలేట్ అవుతున్నాయ‌ని పేర్కొన్నారు. వారంద‌రి భ‌ర‌తం ప‌డుతాం..కేసీఆర్ ప్ర‌భుత్వం అంటే ఏదో త్వ‌ర‌లోనే వారికి చూపిస్తామంటూ హెచ్చ‌రించారు. అంత‌కు ముందు క‌రోనా నేప‌థ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌ల్లోకి వ‌చ్చిన నాటి నుంచి అంత‌రాష్ట్ర ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని సీఎం కేసీఆర్ అన్నారు. ఇత‌ర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం ఇక్క‌డికి వ‌చ్చిన వారిని క‌డుపులోకి పెట్టుకోవాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపైనా ఉంద‌ని అన్నారు. ద‌య చేసి వారంద‌రికీ ఉండ‌టానికి గూడు, తిన‌డానికి తిండి, తాగ‌డానికి నీరు, అవ‌స‌ర‌మైన వారికి మందులు కూడా ఇప్పించాల‌ని అధికారుల‌కు సూచించారు. అన్ని జిల్లాలో కలెక్టర్లు, ఎస్పీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: