బతికి ఉంటే బల్సాగు తినొచ్చు అంటారు పెద్దలు.  ఎన్ని కష్టాలు వచ్చినా.. బతికి ఉంటే గంజినీళ్లయినా తాగి బతకొచ్చు అంటారు. ప్రకృతి విపత్తులు సంబవించిన సమయంలో తింటానికి తిండి లేని సమయంలో ఒక్కపూట ఎలాగో అలా గడిస్తే చాలురా భగవంతుడా అనుకుంటారు.  ఇప్పుడు ప్రకృతి విపత్తుకన్నా ఘోరమైన కరోనా వైరస్ ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది.  వేల సంఖ్యలో మరణాలు సంబవిస్తున్నాయి.. లక్షల్లో  కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.  తాజాగా సీఎం కేసీఆర్ మీడియా సమావేశం తర్వాత మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌పై భారత్‌ను ప్రపంచ దేశాలు ప్రశంసించాయి.

 

సీరియస్‌గా ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించాం. వైద్యులు, పోలీసులకు అందరూ సహకరించాలి. దక్షిణ కొరియాలో ఒకే వ్యక్తి ద్వారా 50వేల మందికి వచ్చింది.  రాష్ట్రంలో  కొత్త కేసులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది. కొత్త కేసులు చేరకుంటే ఏప్రిల్‌ 7లోగా కరోనా ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుంది. వ్యాధికి మందులేదు సెల్ఫ్‌ కంట్రోల్‌ మాత్రమే మన ఆయుధం.  కరోనా ఇబ్బందులు ఉంటాయి.. మూడు పూటల తినేవారు రెండుపూటల తిని మిగిలింది దాచుకునే ప్రయత్నం చేయాలన్నారు.  కరోనా యుద్ధం ఎంత దూరం ఉంటుందో తెలియదు.

 

కరోనాపై యుద్ధం చేసేందుకు సన్నద్ధంగా ఉన్నాం.  కరోనా వైరస్‌ వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కష్టకాలంలో అందరం పాలుపంచుకోవాలి. ఎమ్మెల్యేల జీతాలు కూడా బంద్‌ చేసే పరిస్థితి వస్తుంది. 3 నెలల పాటు ఇబ్బందులు తప్పవు. అని కేసీఆర్‌ పేర్కొన్నారు.    

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: