కరోనా వైరస్.. ఉన్న కొద్దీ యూరప్ ఖండాలలో మరియు అమెరికాలో చాలా స్పీడ్ గా విజృంభిస్తోంది. దీంతో ఆయా దేశాల పరిస్థితి దారుణంగా మారింది. దేశాలను పరిపాలిస్తున్న ప్రధాన లకు మరియు అధ్యక్షులకు కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఏం చేయలేని పరిస్థితి అయింది. చాలా మందులు వ్యాక్సిన్లు కనిపెట్టిన లాభం లేకుండా పోయింది. ప్రపంచాన్ని శాసించిన అగ్రరాజ్యం అమెరికా అయితే కరోనా వైరస్ కి పూర్తిగా దెబ్బతింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రపంచంలో అన్ని దేశాల్లో కంటే అమెరికాలోనే ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో పరిస్థితి మొత్తం అంతా డేంజర్ జోన్ లో పడింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇండియాలో వైరస్ ఎక్కువ ప్రబలకుండా ప్రధాని మోడీ ముందే జాగ్రత్తలు తీసుకున్నారు.

 

దేశమంతటా 21 రోజుల పాటు షట్ డౌన్ అని ప్రకటించి...దేశంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యేలా వ్యవహరించారు. ఇటువంటి తరుణంలో పంజాబ్ రాష్ట్రానికి చెందిన మత ప్రబోధకుడు కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న జర్మనీ మరియు ఇటలీ అదేవిధంగా స్పెయిన్ దేశాల్లో పర్యటించి ఆ వైరస్ ని అంటించుకుని తెలిసికూడా పంజాబ్ రాష్ట్రంలో గ్రామాల్లో ఉత్సవాలు నిర్వహించారు. దాదాపు ఈ ఉత్సవాలకు లక్ష మందికి పైగానే అమాయక గ్రామ ప్రజలు హాజరయ్యారు.

 

దీంతో ఆ మత ప్రబోధకుడు కరోనా వైరస్ తో ఇటీవల చనిపోవడంతో...ఆ గ్రామాల ప్రజలు అంతా ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఆ గ్రామాలను రెడ్ జోన్ పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది ప్రకటించి ఎవరు కూడా బయటకు రాకుండా చూసుకుంటున్నారు. ఎవరికి సోకిందో అన్న భయాందోళనలు కలిగిన ఆ గ్రామ ప్రజలంతా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా తెగ భయపడిపోతున్నారట. దీంతో పంజాబ్ ప్రభుత్వం ఆయా గ్రామాల చుట్టూ పోలీసుల చేత పహారా పెట్టి వేరేవాళ్లను ఆ గ్రామాల్లోకి...ఆ గ్రామంలోని వాళ్లను బయటకు రాకుండా చూసుకుంటూ మరోపక్క టెస్టులు చేయించే కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: