తెలంగాణ  రాష్ట్రంలో ప్రాణాంతకమైన  కరోనా  వైరస్ ప్రభావం ఎక్కువ ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా... రోజురోజుకు కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది ఉంది.  ఈ నేపథ్యంలోనే ఎన్నో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న కేసీఆర్... నెమ్మదిగా కరోనా వైరస్ పై విజయం దిశగా అడుగులు వేస్తోన్నామంటూ తెలిపారు . అయితే తాజాగా మీడియాతో మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కరోనా వైరస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పూర్తిగా కరోనా  వ్యాధి సోకిన వారి సంఖ్య 70 కి చేరిందన్న   ముఖ్యమంత్రి కేసీఆర్... 11 మంది ఈ  ప్రాణాంతకమైన మహమ్మారి నుండి  కోలుకున్నారు అని ప్రకటించారు. అయితే తమకు అందిన సమాచారం ప్రకారం తెలంగాణలో కరోనా వైరస్ బారిన పడి అందరూ కోలుకునే అవకాశం ఉంది కేసీఆర్ తెలిపారు. 

 

 

 ఈరోజు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కరోనా  పాజిటివ్ కేసులు కూడా నమోదు కాకపోతే ఏప్రిల్ 7 నాటికి  తెలంగాణ ప్రజల్లో  ఒక్కరికి కూడా ఉండదు అంటూ తెలిపారు . అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో 25 వేల తొమ్మిది వందల మందికి పైగా మంది ఉన్నారు అంటూ తెలిపిన కేసీఆర్... వారిలో 11 మందిని డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు.  ప్రజలందరూ కరోనా  వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదని వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే సరిపోతుంది అంటూ తెలిపారు. 

 

 

 కరోనా వైరస్ నుంచి కోలుకున్న 11 మంది  సోమవారం నాడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తాము  అంటూ  ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. అంతేకాకుండా ప్రభుత్వం ప్రస్తుతం ఏర్పాటు చేసిన క్వారంటైన్  లో ఉన్న వాళ్ళు ఏప్రిల్ 7 తర్వాత   చాలామంది క్వారంటైన్ నుండి  వెళ్ళిపోతారు అంటూ తెలిపారు . ఏ రోజు ఎంతమంది వెళ్ళిపోతారో  డీటెయిల్స్ కూడా పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: