ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఒకే ఒక సమస్య కరోనా.. చైనా నుంచి వచ్చి  తెలుగు రాష్ట్రాల ప్రజలను పూర్తిగా భయంలో పడేసిన ఈ కరోనా కారణంగా చాలా మంది నానా తంటాలు పడుతున్నారు..ఈ మేరకు..పేదలను ఆదుకోవాలని సినీ రాజకీయ ప్రముఖులు ముందుకొస్తున్నారు.. ఇప్పటికే చాలా మంది తెలుగు రాష్ట్రాల కోసం విరాళాలను సేకరిస్తున్నారు..

 

 

 

ప్రముఖులు కూడా వారికి తోచిన సాయన్ని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందజేస్తున్నారు.. అయినా కరోనా వ్యాప్తి మాత్రం ఎక్కడ తగ్గలేదు.. ..అందుకే కరోనా ప్రభావాన్ని పూర్తిగా తగ్గించేందుకు ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది.. ఈ మేరకు జనతా కర్ఫ్యూ నీ కూడా ప్రకటించింది.. కరోనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధించింది .ఈ మేరకు ప్రజలు బయటకు రాకూడదని సూచించింది.. అయితే కరోనా ప్రభావం మరింత ముదిరింది. ఇప్పటికే తెలంగాణలో 70కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. 

 

 

 

తీవ్రంగా అలవాటు పడిపోయిన వ్యక్తులు ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల్లో వింతగా ప్రవర్తిస్తున్నారు. కొందరు అనారోగ్యం పాలవుతుంటే, మరికొందరు వింతగా ప్రవర్తించి అఘాయిత్యాలకు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి మద్యం దొరక్క ఫిట్స్ వచ్చి చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరో వ్యక్తి గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన హైదరాబాద్‌లోనే జరిగింది.

 

 

 

వివరాల్లోకి వెళితే .. మహబూబ్ నగర్ జిల్లాలోని రోజువారి కూలీకి వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజు పని నుంచి ఇంటికి వచ్చే ముందు దారిలోనే మద్యం దుకాణానికి వెళ్లి మందు తాగి ఇంటికి వెళ్లేవాడు. ఇలా ఏళ్లుగా మద్యానికి బానిసైపోయాడు. లాక్ డౌన్ కారణంగా చాలా రోజుల నుండి మద్యం దొరకపోవడంతో తట్టుకోలేక ఇంట్లో ఉన్న కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.  అది చూసిన కుటుంబ సభ్యులు అతనికి వెంటనే ఆసుపత్రికి తరలించారు.. అయిన అయిన బ్రతకలేదని వెల్లడించారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: