కరోనా వైరస్ రోజు రోజుకు ఎలా పెరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తున్నా ఈ కరోనా వైరస్ చైనాలోని వుహాన్ నగరంలో పుట్టింది. అలాంటి ఈ కరోనా వైరస్ బారిన పడి ఇప్పటికే 32వేలమంది మృతి చెందారు.. 6లక్షలమంది చికిత్స పొందారు. ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ భారత్ లోకి చేరుకొని ప్రజలను భయాందోళనకు గురిచేసింది. 

 

దీంతో కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14వ తేదీ వరుకు లోక్ డౌన్ విధించింది. దేశ ప్రజలు ఎవరు కూడా బయటకు రాకుండా ఉండాలని ఆదేశించింది. ఇంకా ఈ నేపథ్యంలోనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే కూడా సీఎం కేసీఆర్ ముందు నుండి కూడా కఠిన చర్యలు తీసుకున్నారు. అందుకే తెలంగాణాలో కరోనా కేసులు తోకముడుస్తున్నాయి.. 

 

ఈరోజు మీడియా ముందుకు వచ్చిన కేసీఆర్ ఎన్నో సంచలన విషయాలు వెల్లడించారు. 11 మంది కరోనాను జయించారు అని.. త్వరలోనే అందరూ కూడా ఆరోగ్యవంతులుగా అవుతారు అని.. ఏప్రిల్ 2వ వారనికి కరోనా వైరస్ ను జయించిన రాష్ట్రం అవుతుంది అని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే పేద ప్రజలకు అండగా ఉంటా అని చెప్పిన కేసీఆర్ సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు తీసుకుంటా అని సీఎం కేసీఆర్ చెప్పారు. 

 

కరోనాపై దుర్మార్గ ప్రచారం చేస్తున్నారు అని సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం చేసే వాళ్ల సంగతి చెప్తా అని అయన హెచ్చరించారు. కటిన చర్యలు ఎలా ఉంటాయో చూపిస్తా అని.. అసత్య ప్రచారం చేసే వాళ్ళకే ముందుగా కరోనా సోకాలి అని ఆ దుర్మార్గులకు కరోనా రావాలని శాపం పెడుతున్న అంటూ అయన మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు.. మరి సోషల్ మీడియాలో దృష్ప్రచారం చేసే వారి పరిస్థితి ఏంటో చూడాలి. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: