ముఖ్యమంత్రి సహాయనిధి కి సింగరేణి కార్మికులు ఇప్పటికే  విరాళాన్ని ప్రకటించారు .అయితే ఈ విరాళాన్ని ఇచ్చేందుకు కొంతమంది కార్మికులు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది . ఇదే విషయమై వారిలో కొంతమంది  తమ యాజమాన్యానికి లేఖలు రాసినట్లు సమాచారం . కరోనా కట్టడి కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి అన్ని వర్గాల వారు తమవంతుగా విరాళాలను అందజేస్తున్నారు . దానిలో భాగంగా సింగరేణి కార్మికుల పక్షాన కార్మిక సంఘాల నేతలు ఒకరోజు వేతనాన్ని విరాళంగా అందజేయనున్నట్లు ప్రకటించారు.

 

అయితే కార్మిక సంఘాల నేతల ప్రకటనతో  కొంతమంది  కార్మికులు విభేదిస్తున్నారు . కరోనా కట్టడికి ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం ఇచ్చేందుకు  కార్మికులు ఎందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారన్న దానిపై ఆరాతీస్తే , లాక్ డౌన్ సందర్బంగా  పరిశ్రమలు , కర్మాగారాలు అన్ని మూసివేస్తూ నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం , సింగరేణి ని మాత్రం యధావిధిగా కొనసాగిస్తోంది . దీనిపై   కార్మికులు ఆగ్రహం తో రగిలిపోతున్నారు . తమవి మాత్రం ప్రాణాలు కావా? అంటూ ప్రశ్నిస్తున్నారు . లాక్ డౌన్ సందర్బంగా సింగరేణిని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించడం వల్లే , కరోనా కట్టడికి ముఖ్యమంత్రి సహాయనిధి ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇస్తామన్న ఉన్నతాధికారుల , కార్మిక సంఘాల నేతల నిర్ణయాన్ని కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలుస్తోంది  .

 

ఇకపోతే లాక్ డౌన్ ను దృష్టిలో పెట్టుకుని  సింగరేణి లో గనుల తవ్వకాలను కూడా నిలిపివేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి . ఈ మేరకు సిపిఐ కార్యదర్శి venkat REDDY' target='_blank' title='చాడ వెంకట్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>చాడ వెంకట్ రెడ్డి , ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ  రాశారు . భూగర్భ గనుల్లో పని చేసే కార్మికులకు వెంటిలేషన్ కూడా సరిగ్గా ఉండదన్న ఆయన , ఒక వేళ కార్మికుల్లో  ఎవరికైన కరోనా వ్యాధి సోకితే ,  జరగబోయే  ప్రమాదం తీవ్రంగా ఉంటుందన్నారు . ఒక్కరి నుంచి వ్యాధి అందరికి సంక్రమించే ప్రమాదం ఉందని అన్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: