కరోనా మహమ్మారి ప్రపంచాన్నే వణికిస్తోంది. అయితే కరోనా ప్రభావం అందరికన్నా ఎక్కువగా అమెరికాపైనే ఉండొచ్చంటున్నారు వైద్య నిపుణులు. ఈ దేశంలో కనీసం లక్షకు పైగానే కరోనా మరణాలు సంభవించొచ్చంటూ వెలువడుతున్న నివేదికలు విస్తుగొలుపుతున్నాయి. ఆ స్థాయిలో కరోనా అమెరికాలో విజృంభించనుందన్న విశ్లేషణలు ఆ దేశీయుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.

 

 

ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు.. అమెరికాకు చెందిన వైద్యనిపుణుడు.. డాక్టర్ ఆంథొనీ ఫాచీ. తాజాగా ఆయన సీఎన్‌ఎన్‌ తో మాట్లాడుతూ... అమెరికాలో కరోనా మరణాలు లక్ష దాటతాయని అంచనా వేశారు. కరోనాతో అమెరికాలో చనిపోయేవారి సంఖ్య లక్ష నుంచి రెండు లక్షలు ఉంటుందని ఆయన అంటున్నారు. అమెరికాలో కరోనా నివారణ కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అంతగా ఫలించే అవకాశాలు కనిపించడం లేదని.. చెప్పారు.

 

 

ఇప్పుడు ఈ నిపుణుడు డాక్టర్ ఆంథొనీ ఫాచీ మాటలు అమెరికన్లను భయపెడుతున్నాయి. ఎందుకంటే.. అమెరికా ఎక్కువగా నమ్ముకున్నది ఆయననే. ఆయనే ఇలా మాట్లాడేసరికి అమెరికన్లు మరింతగా భయపడుతున్నారు. ఇంతకీ ఈ ఫోచీ మాటలకు అంత ప్రాముఖ్యత ఏంటంటారా.. డాక్టర్ ఆంథొనీ ఫాచీ కరోనావైరస్‌తో అమెరికా చేస్తున్న పోరాటంలో ఈయన ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.

 

 

ఆంథోనీ ఫాచీ.. ఓ వైద్య పరిశోధకుడు. ఈ రంగంలో ఆయనకు 50 ఏళ్ల అనుభవం ఉంది. ఇప్పుడు ఆయనవైపే అమెరికా ఎందుకు అంత ఇంట్రస్టింగా చూస్తుందంటే.. ఆయనకు ఇలాంటి మహమ్మారి రోగాలతో పోరాడి జయించిన చరిత్ర ఉంది. 1980లలో అమెరికాలో ఎయిడ్స్ మహమ్మారి వ్యాపించిన సమయంలో దాన్ని అరికట్టేందుకు ఆయన కీలక పాత్ర పోషించారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఇమ్యునాలజీ అధిపతిగా ఉన్న డాక్టర్ ఫాచీ ఇప్పుడు 79 ఏళ్ల వయసులో మరోసారి కరోనా వంటి మహమ్మారిపై పోరాటం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: