ప్రసిద్ధ ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా అధినేత జాక్... కరోనా నేపథ్యంలో భారత్ కు ఔషధాల రూపంలో సాయం అందిస్తున్నారు. కరోనా నివారణకు ఉపయోగ పడే అనేక అత్యవసర ఔషధాలను జాక్ మా ఫౌండేషన్, అలీబాబా ఫౌండేషన్ భారత్‌ తో పాటు మరో ఆరు దేశాలకు అందించాలని జాక్‌ మా నిర్ణయించారు. ఇండియాతో పాటు అజర్ బైజాన్, భూటాన్, కజకిస్తాన్, కిర్గీస్థాన్, ఉజ్బెకిస్తాన్, వియత్నం వంటి దేశాలకు జాక్ మా ఫౌండేషన్, అలీబాబా ఫౌండేషన్ తమ సాయం అందించనున్నాయి.

 

 

భారత్ తో పాటు ఈ మొత్తం ఏడు దేశాలకు 17 లక్షల మాస్కులు, 1,65,000 టెస్టు కిట్లు, రక్షణ వస్త్రాలతో పాటు అనేక వెంటిలేటర్లు, ధర్మల్ గన్లు వంటి కీలకమైన వైద్య పరికరాలను అందజేయనున్నారు. ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తున్న నేపథ్యంలో జాక్ మా ఫౌండేషన్, అలీబాబా ఫౌండేషన్ ఇప్పటికే పలు దేశాలకు సాయం అదిస్తున్నాయి. తాజాగా భారత్ తోపాటు ఏడు దేశాలకు చేస్తున్న సాయంతో మొత్తం ఈ ఫౌండేషన్లు సాయం అందిస్తున్న ఆసియా దేశాల సంఖ్య 23కు చేరింది.

 

 

మొత్తం మీద 70 లక్షల మాస్కులు, 4,85,000 టెస్టు కిట్లు ఇప్పటి వరకూ ఈ ఫౌండేషన్లు ఆయా దేశాలకు పంపించాయి. ఈ జాక్ మా, అలీబాబా ఫౌండేషన్లు అందించిన ఔషధాల తొలివిడత సాయం శనివారం ఢిల్లీకి చేరింది. ఇండియన్ రెడ్‌ క్రాస్ సంస్థకు ఈ వైద్య పరికరాలు, ఔషధాలను జాక్ మా, అలీబాబా ఫౌండేషన్ అందించాయి.

 

 

జాక్‌ మా ఫౌండేషన్‌ ఇప్పటికే అమెరికాకు ఆపన్న హస్తం అందిస్తోంది. కరోనా తీవ్రత ఎక్కువున్న అమెరికాకు దాదాపు 5లక్షల కిట్లను, పది లక్షల మాస్కులకు ప్రత్యేక విమానంలో పంపించారు. తమకు చేస్తున్న సాయానికి జాక్‌ మా ను చాలామంది అమెరికన్లు అభినందించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: