మన దేశంలో లాక్ డౌన్‌ మరింత పటిష్టంగా అమలవుతోంది. కేంద్రం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనా ప్రజలు రోడ్లపై కనిపించేందుకు వీలు లేదని తేల్చిచెప్పింది. నిత్యావసరాలు, మందుల కోసం తప్ప.. వేరే ఏ ఇతర కారణాలతోనూ జనం వీధుల్లో కనిపించరాదని ప్రకటించింది. అంతే కాదు. లాక్‌ డౌన్‌ ఉత్తర్వులను ఆదేశాలను ఉల్లంఘిస్తే.. వారిని 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచాలని రాష్ట్రాలను ఆదేశించింది.

 

 

ఇక ఢిల్లీతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో వలస కూలీలు గుంపులు గుంపులుగా తమ సొంతూళ్లకు ప్రయాణమైన దృష్ట్యా.. ఇలాంటి వాటిని కూడా అనుమతించ కూడదని కేంద్రం రాష్ట్రాలకు గట్టిగా చెప్పింది. అయితే ఈ వలస కూలీలు ఎక్కడ ఉంటే.. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలే వారికి ఆహారం, వసతి కల్పించాలని ఆదేశించింది.

 

 

ఇప్పటికే ఇండియాలో కరోనా వైరస్ తన ప్రతాపం చూపుతోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా వెయ్యి దాటింది. దాదాపు 30 మంది వరకూ కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రజలు గుంపులు గుంపులుగా కదలడం ఏమాత్రం మంచిది కాదని కేంద్రం చెబుతోంది. ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని చెప్పింది.

 

 

అలాగే వలస కూలీలకు యజమానులు పూర్తి జీతం అందజేయాలని కేంద్రం చెప్పింది. అంతేకాదు.. వారు అద్దెకు ఉంటున్న ఇళ్ల వద్ద యజమానులు అద్దెల కోసం వేధించకూడదని కూడా కేంద్రం ఆదేశించింది. ఈ ఉత్తర్వులు అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దృశ్యం పరిశీలిస్తే.. అమెరికాలో ఒక్క రోజే 1900 మంది చనిపోయారు. అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య లక్షా 24 వేలకు చేరుకుంది.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: