భారత్‌లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్‌లో 21 రోజులపాటు లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కరోనా పాజిటివ్ కేసుల నమోదు ఆగడంలేదు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 1045 కు చేరింది.

 

ఆంధ్రప్రదేశ్‌లో రోజు కొత్తగా ఇద్దరికి కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గతంలో యూకే నుంచి వచ్చి కరోనా బారిన పడిన పేషెంట్ నెంబర్ 7కు కొత్తగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వారు కాంటాక్ట్ కావడంతో కరోనా వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 21కి పెరిగింది.

 

ఇకపోతే అటు తెలంగాణ రాష్ట్రంలో రెండో మరణం సంభవించింది. కరోనా బారినపడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 69 ఏళ్ల వృద్ధుడు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇతడికి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు 70కి చేరుకున్నాయని.. వీరిలో 11 మంది పూర్తిగా కోలుకోగా, ఒకరికి మాత్రం పరిస్థితి కాస్త విషమంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో వెల్లడించారు

 

కొద్ది రోజులుగా కరోనా విలయతాండవం చేస్తున్న ఇటలో లో వైర‌స్ సంక్రమించిన వారి సంఖ్య 90 వేలు దాటింది. నిన్న ఒక్కరోజే ఇట‌లీలో వైర‌స్ వ‌ల్ల ఒక్క రోజే 889 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మ‌ర‌ణాల సంఖ్య 10 వేల 23కు చేరుకుంది. స్పెయిన్‌లో కూడా కరోనా వైరస్‌ విజృంభించింది. ఒక్కరోజులో కొత్తగా 6500కుపైగా కేసులు వెలుగు చూశాయి. 832 మంది రోగులు చనిపోయారు. 9వేల మందికిపై ఆరోగ్య సిబ్బంది మహమ్మారి బారినపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: