ప్రస్తుతం కరోనా వైరస్ భారతదేశం మొత్తాన్ని పట్టిపీడిస్తున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న సంచలన గ్రామ వాలంటీర్ల వ్యవస్థ గురించి దేశవ్యాప్తంగా పెద్ద చర్చే నడుస్తోంది.

 

మొదట్లో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి వార్డుకు రాష్ట్రమంతటా గ్రామ వాలంటీర్లను నియమిస్తున్నటు ప్రకటించినప్పుడు చాలామంది ఎన్నో కామెంట్లు చేశారు. అప్పుడు గ్రామ వాలంటీర్లను చులకన చేసి చూసిన వారంతా ఇప్పుడు జగన్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

 

ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు జగన్ యొక్క విన్నూత మోడల్ ని అనుసరించాలని నిర్ణయించుకున్నాయి. కేరళ సీఎం పినరయి విజయన్ జగన్ ను విషయంలో ప్రశంసించి తాను కూడా వాలంటీర్లను నియమించిన సంగతి తెలిసిందే.

 

తాజాగా మన దేశాన్ని ఒకటిన్నర శతాబ్దం పైనే పాలించిన గ్రేట్ బ్రిటన్ వారు కూడా ఇదే తరహాలో నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు వారు కూడా తామ్ దేశంలో వాలంటీర్లను నియమించాలని నిర్ణయించారు.  దేశవ్యాప్తంగా 2 లక్షల మంది వాలంటీర్లను నియమిస్తున్నట్లు కూడా దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు.

 

వాలంటీర్ల వ్యవస్థ ద్వారా క్షేత్ర స్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుని తదనుగుణంగా చర్యలు చేపట్టే వీలుంటుంది. నేపథ్యంలోనే జగన్ గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ను నియమించారు. ఇప్పుడు వారి సేవలు కరోనా నియంత్రణ చర్యల్లో బాగా ఉపకరిస్తున్నాయి. అందుకే పలు రాష్ట్రాలు కూడా వ్యవస్థపై ఆసక్తి చూపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: