ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న కరోనా వైరస్ ఒక దేశంలో పేదవాడి నుండి ప్రధానమంత్రి వరకు తేడా లేకుండా అందరినీ బలి తీసుకుంటోంది. ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటైన అమెరికా, ఇటలీ, స్పెయిన్, జర్మనీ దేశాలలో అయితే వైరస్ విలయతాండవం చేస్తుంది.

 

ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి చాలా సులువుగా సంక్రమించే వైరస్ ను అరికట్టేందుకు చాలా దేశ ప్రభుత్వాలు ఎన్నో విఫలయత్నాలు చేశాయి. ఇక దారి లేక…. ఏమీ చేసే వీలు లేక ప్రపంచంలోని చాలా దేశాలు లాక్ డౌన్ చేసి భారతదేశంలో లాగానే ప్రజలందరినీ ఇంటికి పరిమితం కావాలని పిలుపునిచ్చాయి.

 

అయితే మొట్టమొదటిసారి చైనాలో పుట్టిన వైరస్ ప్రారంభంలో అక్కడ స్వైరవిహారం చేసింది కానీ ప్రస్తుతం చైనా విపత్కర పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. దానికి కారణం వండర్ డ్రగ్ అనే మందు అని…. అది ఉపయోగించి చైనా దేశానికి చెందిన కరోనా వైరస్ బాధితులకి ఉపయోగించడంతో ప్రస్తుతం దేశంలో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు. సమాచారం అలాగే డ్రగ్ చైనా దేశానికి.... ప్రపంచ దేశాలకు చెందిన డాక్టర్లకు పంపించే దిశగా మంచి పేరొందిన క్యూబా దేశం డ్రగ్ ను పంపించి కాపాడినట్లు సమాచారం.

 

వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే దేశంగా పేరొందిన క్యూబా దేశం మరియు చైనా కమ్యూనిస్టు దేశాలు కావడం వల్ల వారికి మంచి సంబంధాలు ఉండడంతో మందుని ఉపయోగించుకుని చైనా ప్రభుత్వం కరోనా బారి నుండి బయటపడింది అని అంటున్నారు.  ప్రస్తుతం మందుని 15 దేశాలకు క్యూబా ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో భారత్ కూడా ఉంది అని పలువురు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: