ఏప్రిల్ 7 తర్వాత తెలంగాణాలో కరోనా కేసు నమోదు అయ్యే అవకాశం లేదని, ఉన్న వాళ్లకు తగ్గిపోతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేసారు. రాష్ట్రంలో కరోనా వైరస్ ఇప్పుడు అదుపులోకి వచ్చేసినట్టే కనపడుతుంది. ఉన్న వాళ్ళల్లో 11 మందికి కరోనా వైరస్ తగ్గిపోయింది. వాళ్ళను నేడు ఆస్పత్రిని డిశ్చార్జ్ చేయనున్నారు. క్వారంటైన్ లో ఉన్న వాళ్లకు కూడా కరోనా బయటపడటం లేదు. 

 

వాళ్ళు అందరూ కూడా క్వారంటైన్ నుంచి బయటకు రానున్నారు. అయితే తెలంగాణాలో మూడో దశలో ఉందని కొందరు అంటున్నారు. ఇప్పుడు కరోనా కుటుంబాల్లో బయటపడుతుంది. వాళ్ళ నుంచి ఎవరికి అయినా సోకిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాళ్ళు వెళ్లి కలిసిన వాళ్ళను కూడా అధికారులు క్వారంటైన్ లో ఉంచారు. కొత్త గూడెం డిఎస్పీ కుమారుడుకి కరోనా సోకింది. అతని నుంచి మరి కొంత మందికి బయటపడింది. 

 

అయితే తెలంగాణాలో ఇప్పుడు 70 మందికి కరోనా వైరస్ సోకింది. వారిలో 58 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. వారి ప్రాణాలకు కూడా వచ్చే ఇబ్బంది ఏమీ లేదని అధికారులు అంటున్నారు. క్వారంటైన్ లో ఉన్న 25 వేల మంది ఉన్నారు. వారు అందరూ బయటకు వచ్చేయనున్నారు. దీనితో రాష్ట్రంలో కరోనా బయటపడే అవకాశాలు లేవని కెసిఆర్ ధీమాగా ఉన్నారు. ఇతర రాష్ట్ర సరిహద్దులను కూడా తెలంగాణా మూసి వేసింది. అంతర్జాతీయ విమానాలు కూడా రద్దు చేసారు కాబట్టి ఇప్పుడు కరోనా విస్తరించే అవకాశం లేదని అంటున్నారు.

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: