కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ దేశాలన్నిటిని చుట్టుముట్టింది. దీని ప్రభావం ఎంత స్పీడ్ గా ఉందో ఇప్పటికే అన్ని దేశాలు చవిచూస్తున్నాయి. ఒకరి నుంచి ఒకరికి ఈ వైరస్ ప్రపంచ దేశాలన్నిటిని చుట్టుముట్టి కలవరపెడుతున్నాయి. ప్రస్తుతం అన్ని దేశాలు మిగతా అన్ని విషయాలను పక్కన పెట్టి పై కరోనా పై మాత్రమే ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఈ వైరస్ మొట్టమొదటిగా పుట్టిన చైనాలో ఇప్పుడు తగ్గుముఖం పట్టినా, మిగతా ప్రపంచ దేశాల్లో ఇంకా ఆ మహమ్మారి నుంచి బయట పడలేదు. ప్రస్తుతం ఈ వైరస్ పుట్టిన చైనాలో కంటే మిగతా దేశాల్లో తీవ్ర స్థాయిలో ఉండడంతో, ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ప్రజలంతా భయాందోళనలు కనిపిస్తున్నారు. ఒక దేశం నుంచి మరొక దేశానికి కరోనా వ్యాపిస్తూ కరోనా పాజిటివ్ కేసులు మరింతగా నమోదవుతున్నాయి. దాదాపు 190 దేశాల్లో కరోనా వైరస్ ప్రభావం ఉండగా, 15 దేశాల్లో మాత్రం ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. 

 

IHG

రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది తప్ప ఎక్కడ  అదుపులోకి వస్తున్నట్టు కనిపించడం లేదు. కొన్ని దేశాల్లో ఈ వైరస్ ప్రభావం ఎక్కువ కాకుండా ముందస్తు జాగ్రత్తలు గట్టిగానే తీసుకున్నా చాలా దేశాలు మాత్రం ఈ వైరస్ ను తేలిగ్గా తీసుకుని నిర్లక్ష్యం వహించడంతో ఈ వైరస్ వ్యాధి మరింత ఎక్కువైంది. ప్రపంచ దేశాలకు పెద్దన్నగా ఉంటూ వస్తున్న అమెరికాను కూడా ఇప్పుడు ఈ కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. మొదట్లోనే కరోనా వైరస్ ను అమెరికాలో గుర్తించినా దానిని పెద్దగా పట్టించుకోకపోవడం, ఆ తరువాత గుర్తించే సమయం నాటికి లక్షలాది మందికి ఈ వైరస్ ప్రభావానికి గురవ్వడం జరిగిపోయాయి. 


ఇప్పుడు అమెరికాలో దీనికి సంబంధించి ఎటువంటి మందులు అందుబాటులో లేకపోవడం, అసలు కరోనా టెస్ట్లు చేసేందుకు  సరైన కిట్లు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి లేకపోవడం అమెరికా వెనుకబాటు తనాన్ని గుర్తు చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న 10 దేశాలను చూసుకుంటే మొదటి స్థానంలో అమెరికా ఉంది. ఇక్కడ 01, 30,000 కరోనా కేసులు నమోదవడంతో అమెరికా వణికిపోతోంది. అలాగే మృతుల సంఖ్య కూడా రెండు వేలకు పైగా ఉంది. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఇటలీ ఉండగా ఇప్పుడు అమెరికా ఆ రికార్డు ను సొంతం చేసుకుంది. ఇటలీలో సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో ఈ వైరస్ అక్కడ బాగా వ్యాప్తి చెందింది. 


 ఇప్పటి వరకు 92 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మరణాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. చైనాలో ఈ వైరస్ కారణంగా 80 వేల మంది దాని ప్రభావానికి గురయ్యారు. మూడున్నర వేలకు పైగా మరణాలు సంభవించాయి. అలాగే స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్ లో కూడా ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. మరణాలు ఐదు వేల వరకు ఉన్నాయి. జర్మనీలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగానే ఉన్నా, మిగతా దేశాలతో పోలిస్తే ఇక్కడ మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంది.


కరోనాలో టాప్ టెన్ దేశాలు ఇవే 

 

అమెరికా (యూఎస్ఏ)
ఇటలీ 

చైనా 

స్పెయిన్

జర్మనీ 

ఫ్రాన్స్ 

ఇరాన్ 

యూకే (లండన్)

స్విట్జర్లాండ్ 

నెదర్లాండ్స్ 

మరింత సమాచారం తెలుసుకోండి: