ఆంధ్రప్రదేశ్ లో కరోనా కాంటాక్ట్ కేసులు పెరగడం ఇప్పుడు అక్కడి ప్రభుత్వాన్ని కలవర పెట్టే అంశం. కరోనా వైరస్ ని కట్టడి చేయడంలో ఏపీ ప్రభుత్వం సమర్ధవంతంగా పని చేస్తున్నా విదేశాల నుంచి వచ్చిన వాళ్లకు క్రమంగా కరోనా బయటపడటం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. ఒక్కొక్కటిగా కాంటాక్ట్ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా నమోదు అయిన రెండు కేసులు కూడా అవే. 

 

దీనితో ఏపీ ప్రభుత్వంలో అలజడి మొదలయింది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు...? ఎక్కడ తిరిగారు అనే దాని మీద అధికారులు ఆరా తీస్తున్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు...? సినిమాలకు ఏమైనా వెళ్ళారా...? లేకపోతే ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళారా...? ఎక్కడ ఎక్కడ ఉన్నారు...? ఏదైనా బార్ కి పబ్ కి వెళ్ళారా అనేది ఆరా తీస్తున్నారు అధికారులు. ఇక కాంటాక్ట్ కేసులు ఏ విధంగా నమోదు అవుతున్నాయి అనేది కూడా ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. 

 

ప్రభుత్వం చాలా వరకు కఠిన ఆంక్షలు అమలు చేస్తుంది. ఇంట్లో ఒకరి నుంచి మరొకరికి కరోనా వైరస్ సోకుతుంది. కాబట్టి కాంటాక్ట్ కేసులు నమోదు అయిన కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్ లో ఉంచుతున్నారు. ఇది గనుక మరింత రెచ్చిపోతే మాత్రం అధికారులు చేసేది ఏమీ ఉండదు. అందుకే ఇప్పుడు ప్రతీ ఇల్లుని గాలిస్తున్నారు. ఎక్కడా కూడా అలసత్వం ప్రదర్శించడం లేదు. అయినా సరే ఇప్పుడు ఆందోళన మాత్రం తీవ్ర స్థాయిలో ఉంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: