క‌రోనా దెబ్బ‌తో ఎన్నో సంచ‌ల‌న సంఘ‌ట‌న‌లు ప్ర‌పంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్నాయి. ఓ శ‌తాధిక వృద్ధురాలు ఏకంగా రెండు ప్ర‌పంచ యుద్ధాల‌ను చూసింది.. అయితే 20వ శ‌తాబ్దంలో వ‌చ్చిన స్పానిష్ ప్లూను సైతం త‌ట్టుకుని నిల‌బ‌డింది. అలాంటిది నేడు ఆమె క‌రోనా దెబ్బ‌కు బ‌లైపోయింది. ఇంత‌కు ఆమె ఎవ‌రంటే బ్రిట‌న్‌లో 108 ఏళ్ల వృద్ధురాలు కావ‌డం గ‌మ‌నార్హం. 108 ఏళ్ల ఆ యోధురాలి పేరు హిల్డా చర్చిల్‌. మరో వారంలో తన 109వ పుట్టినరోజును జరుపుకొనేందుకు సిద్ధమవుతున్న వేళ.. కరోనా భారినపడి ఆదివారం కన్నుమూసింది. 

 

ఈ ఒక్క సంఘ‌ట‌న‌ను బ‌ట్టే ప్ర‌పంచాన్ని క‌రోనా మ‌హ‌మ్మారి ఎలా భ‌య‌పెడుతోందో ? అర్థ‌మ‌వుతోంది. 1945లో బ్రిట‌న్‌లో ప్ర‌పంచ యుద్ధం ఎంతో భీక‌రంగా జ‌రిగింది. అప్పుడు సైతం ఆమె వీటిని త‌ట్టుకుని నిల‌బ‌డ‌డంతో పాటు ఎన్నో వ్యాధుల‌ను కూడా స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంది. కానీ ఇప్పుడు.. ప్రపంచానికే సవాల్‌ విసురుతున్న కరోనాతో పోరాడి.. ఓడి.. తనువుచాలించింది. ఈ క్ర‌మంలోనే ఆమె క‌రోనా వైర‌స్‌కు బ‌లైన అత్యంత వ‌య‌స్సు ఎక్కువ ఉన్న వృద్ధురాలిగా నిలిచింది. 

 

ఇక క‌రోనా వైర‌స్ దెబ్బ‌తో ఎక్కువ‌గా వృద్ధులే చ‌నిపోతున్నారు. అప్ప‌టికే వ‌య‌స్సు పైబడిన వృద్ధులు అనేక వ్యాధుల‌తో ఉంటారు. ఈ క్ర‌మంలో వీరికి క‌రోనా సోక‌డంతో ..వీరిలో రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువుగా ఉండ‌డంతో త‌ట్టుకోలేక పోతున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ వైర‌స్ భారీన ప‌డుతోన్న వారిలో ఎక్కువ మంది వృద్ధులు చ‌నిపోతోన్న ప‌రిస్థితి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: