క‌రోనా వైర‌స్‌(కోవిడ్‌-19).. ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా ఇదే మాట వినిపిస్తుంది. చైనాలో పుట్టుకొచ్చిన ఈ మ‌హ‌మ్మారి క‌రోనా ప్ర‌పంచ‌దేశాలు వ్యాపించి.. ప్ర‌జ‌ల‌కు అత‌లా కుత‌లం చేస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా 7, 21, 562 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. అలాగే క‌రోనా సోకి 33, 965 మంది మృతిచెందారు. చైనా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, అమెరికా, ఇరాన్ వంటి దేశాల్లో మరణాల సంఖ్య భయాందోళనలను కలిగిస్తోంది. భారత్ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. మనదేశంలో కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 27కు చేరుకుంది.

 

అయితే మనదేశంలో ఎక్కువగా మహారాష్ట్రలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ ర‌క్క‌సి జన్మనిచ్చిన చైనాలో కంటే పొరుగు దేశాల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్ర‌మంలోనే దాదాపు అన్ని దేశాలు కూడా లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. జనజీవనం స్తంభించిపోయింది. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్‌ను క‌ట్ట‌డి చేయ‌డానికి కేంద్రం లాక్‌డౌన్ ప్ర‌క‌టించింది. దీంతో ప్ర‌జ‌లంద‌రూ ఇంటికే ప‌రిమితం అయిపోయారు. ఈ క్ర‌మంలోనే క‌రోనా ఎప్పుడు చ‌స్తుంది... మ‌నం ఎప్పుడు బయటకు వెళ్లి... స్వేచ్చగా తిరిగే అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నార.

 

దీంతో ఇప్పుడో కొత్త ట్రెండింగ్ సబ్జెక్ట్ తెరపైకి వచ్చింది. అదే WhenCoronaVirusIsOver. ఇందులో పాల్గొంటున్న వారు కరోనా వైరస్ మనుషుల్ని వదిలి వెళ్లిపోయాక తాము ఏం చెయ్యాలనుకుంటున్నదీ నెటిజన్లు అందరితో పంచుకుంటున్నారు. ఇలా చాలా మందే త‌మ అభిప్రాయాల‌ను పంచుకున్నారు. అందులో ముఖ్యంగా కొందరు బయట స్వేచ్ఛగా తిరుగుతామని అంటుంటే.. మరికొందరు పెళ్లిళ్లు చేసుకుంటామంటున్నారు. ఇంకొందరు పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తామంటున్నారు. మరికొందరు ఎప్పట్లాగే త‌మ పనులు చేసుకుంటామని అంటున్నారు. ప్ర‌స్తుతం ఈ మ్యాట‌ర్ వైర‌ల్‌గా మారింది. ఇక ఏదేమైన‌ప్ప‌టికీ వీళ్లు మాత్రం క‌రోనా వైర‌స్ న‌శిస్తుంద‌ని గ‌ట్టి న‌మ్మ‌కంతోనే ఉన్నారు.
 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: