ఛీ ఛీ ఈ జనం మారరు.. ఒకడు మంచిగా బ్రతికి పదిమందిని బ్రతికించడు గానీ, కరోనాను మాత్రం అందరికి పంచుతున్నారు కొందరు విదేశాల నుండి వచ్చిన వారు.. ఈ నగరం కంటే పల్లెలు నయమనిపిస్తున్నాయి.. అక్కడ కరోనా విషయంలో తీసుకునే చర్యలు వందకు వంద శాతం ఫలితాలను ఇస్తున్నాయి.. ఒక ఊరు నుండి మరో ఊరుకు ఎవరు వెళ్లడం లేదు.. ఒక ఇంటి నుండి మరో ఇంటికి రాకపోకలు లేవు.. కానీ నగరాల్లో మాత్రం నల్లికుట్ల నాయాళ్లు తెగమోపైయ్యారు.. ఇంట్లో ఉండి చావండిరా అంటే వినడం లేదు.. ఉగ్రవాదుల కంటే భయంకరంగా తయారైయ్యారు..

 

 

ఇకపోతే నగరంలోని పాతబస్తీలో కొద్ది రోజుల క్రితం విదేశాల నుంచి వచ్చిన క్వారంటైన్ అనుమానితులు మతిస్దిమితం లేని మనుషుల్లా ప్రవర్తిస్తున్నారు.. పిచ్చి ముదిరిన వారిలా ఈ కరోనా అనుమానితులంతా పాతబస్తీ రోడ్లపై బహిరంగంగా తిరుగుతున్నారు. ఇక 8 రోజుల క్రితం లండన్ నుంచి వచ్చిన ఓ యువకుడికి, అధికారులు 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించగా, ఇతను అధికారుల మాటలేం పట్టించుకోకుండా విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతూ ఎంతో మందిని కలుస్తున్నాడు.

 

 

అంతే కాకుండా స్నేహితులతో కలిసి కార్లలో షికార్లు చేస్తున్నాడు.. ఇలాంటి కొండెగాళ్లను అదుపు చేయడం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఇక మరికొందరు బేవార్స్‌లు పోలీసుల లాఠీలతో జనాలను కొడుతు, పోలీసుల దాడులంటూ సామాజిక మాధ్యమాల్లో, ఆ వీడియోలను పోస్టులు చేస్తుండడం కలకలం రేపుతోంది..

 

 

ఇక ఇలాంటి చెత్త గాడిదల వల్లే మనదేశ ఆర్ధిక పరిస్దితికి ముప్పు వాటిల్లేది.. మన రాష్ట్రం ఎంత త్వరగా కోలుకుంటే అంతే త్వరగా పనులు చేసుకుంటూ ఈ ఆకలి బాధ నుండి భయట పడవచ్చని కూలీలు ఆలోచిస్తుంటే.. ఇంకా ఇంకా కరోనా కర్ఫ్యూను పెంచేలా చేస్తున్నారు.. మనుషులుగా పుట్టితే పరిస్దితిని అర్ధం చేసుకుని నడచుకోవాలి గాని ఇలా పదిమంది తో తిట్టించుకుంటూ బ్రతకడం ఎందుకు అని నెటిజన్స్ కోపానికి వస్తున్నారట... 

మరింత సమాచారం తెలుసుకోండి: