దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తుంది.  కనీ వినీ ఎరుగని రీతిలో చైనా నుంచి పుట్టుకొచ్చిన కరోనా వైరస్ చేస్తున్న అలజడితో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి.  ఇప్పటికే వేల మంది మరణాలు.. లక్షల్లో ఈ కేసు భారిన పడ్డారు. తాజాగా భారత దేశంలో కరోనా వల్ల లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో కరోనా కొద్ది కొద్దిగా కంట్రోల్ అవుతుందని అంటున్నారు.  కరోనా వ్యాపిస్తోందన్న భయంతో గజగజలాడుతూ, దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను పాటిస్తున్న భారతావనికి ఓ మంచి వార్త. 

 

గత రాత్రి ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. నిన్న రాత్రికి అధికారిక లెక్కల ప్రకారం, 1139 కేసులు ఇండియాలో ఉండగా, ఈ ఉదయం కూడా రోగుల సంఖ్య అంతే ఉంది. ఈ ఉదయం 7.20 గంటలకు 'ఇండియా కోవిడ్-19 ట్రాకర్'లో పేర్కొన్న వివరాల ప్రకారం, రికవరీల సంఖ్య కూడా గణనీయంగా పెరిగి 103కు చేరుకుంది. ఇక తెలంగాణలో నిన్న పదకొండు మంది రికవరీ అయ్యారు.  వైజాగ్ లో కూడా సోకిన వ్యక్తి రికవరి అవుతున్నారు.  ఇక 19 కేసులు ఏపిలో పాజిటీవ్ గా ఉందని అంటున్నారు. 

 

ఈ గణాంకాల ప్రకారం, 1009 యాక్టివ్ కేసులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో చికిత్స పొందుతుండగా, 27 మంది మరణించారు. కరోనా పాజిటివ్ కేసుల విషయంలో మహారాష్ట్ర, కేరళ పోటీ పడుతూనే ఉన్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 203 కేసులు నమోదు కాగా, మృతుల సంఖ్య 7కు పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఏడు లక్షలకు చేరువ అవుతోంది. కరోనా మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు 32 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారినపడి యూరప్ దేశాలు విలవిల్లాడుతున్నాయి.  స్పెయిన్‌లోనూ కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. అక్కడ ఒక్క రోజులోనే 838 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 6,528కి చేరుకుంది. 78,797 కరోనా నిర్ధారిత కేసులు నమోదయ్యాయి.  

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: