ప్రపంచంలోని మిగిలిన దేశాల సంగతి ఎలాగున్న అగ్రరాజ్యమైన అమెరికా మాత్రం కొరోనా వైరస్ దెబ్బకు చిగురుటాకులాగ వణికిపోతోంది. వైరస్ భయం ప్రపంచాన్ని భయపెడుతున్న తొలి  రోజుల్లో వైరస్ ను అమెరికా పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. అలాంటిది ఇపుడు వైరస్ ను నియంత్రించటానికి నానా అవస్తలు పడుతోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం బాధితుల సంఖ్య లక్ష దాటిపోయింది. అలాగే మరణాల సంఖ్య సుమారు 2 వేలకు చేరుకుంది.

 

మొదటి వారం రోజుల్లో కేవలం రెండంటే రెండు కేసులు మత్రమే నమోదైన అమెరికాలో తర్వాత వారం రోజుల్లో కేసుల సంఖ్య ఒక్కసారిగా 50 వేలకు  చేరుకోవటమే అందరినీ ఆశ్చర్యపరిచింది. సరే ఈ కేసుల సంగతి ఒక ఎత్తైతే తీవ్రత పెరిగిన తర్వాత ప్రభుత్వం కూడా మేల్కొంది. అప్పటి నుండి అనేకకరాలుగా ఆంక్షలు విధించింది.  జనాలు కూడా దాదాపు ఐదు రోజులుగా సెల్ఫ్ క్వారంటైన్ కే పరిమితయ్యారు. అంటే ఎవరి ఇళ్ళల్లో వాళ్ళే ఉంటున్నారు. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో 23 రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలవుతోంది.

 

విచిత్రమేమిటంటే అమెరికాలో గడచిన పదిరోజులుగానే విపరీతంగా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఒకవైపు కఠినంగా ఆంక్షలు విధిస్తున్నా, జనాలు సెల్ఫ్ క్వారంటైన్ పాటిస్తున్నా, లాక్ డౌన్ అమల్లో ఉన్నా కూడా కేసులు వేలల్లో పెరిగిపోతుండటమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకిలా పెరిగిపోతోందంటే మొదట్లో ఆంక్షలు లేనిరోజుల్లో జనాలు విచ్చలవిడిగా తిరిగేశారు. పార్టీలనీ, పబ్బులనీ, ఆఫీసులని గుంపులు గుంపులుగా గుమిగూడారు. ఆ తర్వాత వైరస్ భయంతో ఎవరిళ్ళకు వాళ్ళు పరిమితమయ్యారు.

 

మొదట్లో విచ్చలవిడిగా తిరిగేసిన వారిలో చాలామందికి వైరస్ సోకిందని ఇపుడు అనుమానిస్తున్నారు. వైరస్ సోకిన తర్వాత తీరిగ్గా లాక్ డౌన్ అన్నా ఉపయోగం కనబడటం లేదు. ఎందుకంటే పెరిగిపోయిన వైరస్ తీవ్రత జనాలు ఇళ్ళకే పరిమితమైన సమయంలో బయటపడుతున్నాయి. అందుకనే రోజుకు సగటున 15 వేల కేసులు నమోదైపోతున్నాయి. న్యూయార్క్, న్యూజెర్సీ, కాలిఫోర్నియా, నార్త్ కరోలినా, వాషింగ్టన్, హవానా లాంటి రాష్ట్రాల్లో తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఇపుడు తీసుకుంటున్న ముందు జాగ్రత్తలు మొదట్లోనే తీసుకునుంటే సమస్య ఇంతగా  ఉండేది కాదేమో.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: