క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్‌.. ప్ర‌పంచ‌దేశాల్లో ప్ర‌స్తుతం ఏ స్థాయిలో విస్త‌రిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. చైనాలో ఎక్కడో పుట్టిన ఈ వైరస్ ప్రపంచమంతా విస్తరిస్తూ ప్రాణాలను బలి తీసుకుంటోంది. రోజురోజుకి ఈ వైరస్ బారిన పడి మృత్యుఒడికి చేరుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది.. బాధితుల అయితే ల‌క్ష‌ల్లో ఉన్నారు. ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జపాన్, కెనడా, హాంకాంగ్, మలేషియా, నేపాల్, సింగపూర్, తైవాన్, దక్షిణ కొరియా, థాయ్ లాండ్, వియత్నాం దేశాల్లో వేగంగా ఈ వైరస్ వ్యాపిస్తుంది. 

 

దీంతో ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఈ మహమ్మారికి జన్మనిచ్చిన చైనాలో కంటే పొరుగు దేశాల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు అన్ని దేశాలు కూడా లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. దీంతో ప్ర‌జ‌లు ఇంట్లో ఉండ‌లేక‌.. బ‌య‌ట‌కు రాలేక నానా తంటాలు ప‌డుతున్నారు. అయితే లాక్‌డౌన్ క‌ష్ట‌మే.. కాని, ప్రాణాల కంటే క‌ష్టం కాదు. లాక్‌డౌన్ క‌ష్ట‌మే.. కాని, కుటుంబం కంటే క‌ష్టం కాదు. లాక్‌డౌన్ క‌ష్ట‌మే.. కాని, జీవితం కంటే క‌ష్టం కాదు. అయితే క‌రోనా ర‌క్క‌సి ఎటు నుంచి పుట్టుకొస్తుందో.. ఏ వైపు నుండీ పాకుతుందో.. ఏ క్ష‌ణాన వెంటాడుతుందో.. ఏ నిమిషంలో మీద ప‌డుతుందో తెలియ‌ని ప‌రిస్థితి.

 

ఇక క‌రోనాకు వ్యాక్సిన్ లేదు కాబ‌ట్టి.. నివార‌ణ ఒక్క‌టే మార్గం. అందులో భాగంగా లాక్‌డౌన్‌. కాస్త ఇళ్ల‌ల్లో ఉండండి.. క‌రోనాకు చెక్ పెట్ట‌వ‌చ్చు అంటే.. ఎలాంటి బాధ్య‌త లేకుండా బ‌య‌ట తిరిగేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా మాజీ ఎయిడ్స్ ఛీప్ మాస్ట‌ర్ ఆదిత్య ఓ టాపిక్‌ను రైజ్ చేశారు. 1971 భారత పాక్ యుద్ధంలో ఆదిత్య‌తో పాటు మ‌రికొంద‌రు ప‌ట్టుబ‌డ్డారు. అలా ప‌ట్టుబ‌డిన త‌ర్వాత వాళ్ల‌ను ఆఫ్గనిస్థాన్ బోర్డ‌ర్‌కు తీసుకువెళ్లి ఐదు నెల‌ల పాటు జైల్‌లో ఉంచారు. అది కూడా ఒక చిన్న గ‌ది.. క‌నీసం వెంటిలేట‌ర్ కూడా లేని గ‌దిలో.. కుల్లిపోయిన అన్నం పెట్టి.. నానా చిత్ర‌హింస‌లు చేసి చాలా నెల‌ల పాటు హింసించారు.

 

అలాంటిది ఇప్పుడు ఆనందంగా కుటుంబం స‌భ్య‌లతో ఉండ‌డండి.. స‌ర‌దాగా గ‌డ‌పండి.. అని చెబుతుంటే.. చాలా మంది దాన్ని పెడ‌చెవిని పెట్టి బ‌య‌ట తిరేగేస్తున్నారు. మ‌రి ఇది ఎలా లాక్‌డౌన్ అవుతుంది అని ఒక యుద్ధంలో క‌ష్ట‌ప‌డి.. ఆ త‌ర్వాత ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డిన వ్య‌క్తి అడుగుతున్న ప్ర‌శ్న మ‌న‌ల్ని ఆలోచింప‌చేయాలి. మ‌న కోసం.. మ‌న జీవితాల కోసం.. రేప‌టి భ‌విష్య‌త్తు కోసం.. మ‌నం మారాతామా.. లేదా.. అని ఆయ‌న అడుగుతున్న ప్ర‌శ్న‌. మ‌రి ఆయ‌న ప్ర‌శ్న‌కు స‌మాధానం దొరుకుతుందా.. లేదా.. అన్న‌ది చూడాలి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: