కరోనా ప్రపంచాన్ని కబళిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కరోనాను కట్టడి చేసేందుకు అనేక దేశాలు తమవంతు ప్రయత్నిస్తున్నాయి. కరోనా వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అన్ని వ్యవహారాలు పక్కన పెట్టేసి ఇప్పుడు కరోనా కట్టడిపైనే దృష్టి పెట్టాయి. అయితే కరోనా కట్టడి మాత్రం ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదనే చెప్పాలి.

 

 

అంతే కాదు.. కరోనా వైరస్ మహమ్మారి రెట్టించిన వేగంతో వ్యాపిస్తోంది. గతంలో ప్రపంచంలో రోజూ వేల కొత్త కేసులు నమోదయ్యేవి. ఇప్పుడు ఆ సంఖ్య రోజుకు లక్షల్లో చేరుతోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 7 లక్షలకు చేరింది. రోజూ వేల మంది ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు విడుస్తున్నారు.

 

 

అయితే ఈ మహమ్మారిని కట్టడి చేసే ఔషధాల తయారీ కోసం అనేక పరిశోధన సంస్థలు కృషి చేస్తున్నాయి. అయితే ఈ మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ రూపొందించడం మాత్రం ఆలస్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. పూర్తి స్థాయిలో వ్యాక్సీన్ తయారు చేసేందుకు కనీసం ఏడాది నుంచి ఏడాదిన్నర వరకూ సమయం పడుతుందని ప్రముఖ వైద్యులు డాక్టర్ నాగేశ్వరరెడ్డి చెప్పారు.

 

 

అయితే అప్పటివరకూ కొన్ని ఔషధాలు వాడటం ద్వారా కొంత వరకూ కరోనాపై పోరాటం చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే క్లోరోక్వీన్ వంటి ఔషధాలు బాగానే పని చేస్తున్నాయని కొన్ని ఉదంతాలు చెబుతున్నాయి. ఇంకా ప్రపంచ వ్యాప్తంగా పలువురు వైద్యులు తమ తమ అనుభవంతో కొత్త కాంబినేషన్లతో కరోనాను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వ్యాక్సీన్ వస్తే ఈ మహమ్మారని త్వరగా అంతమొందించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: