భారతదేశంలో రోజు రోజుకి కరోనా వ్యాప్తి వేగంగా ఉంది. ఇప్పటికే కరోనాను కట్టడి చేసేందుకు 21 రోజులు లాక్ డౌన్ విధించారు. కానీ ఇప్పుడు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేయాలనీ కేంద్ర ప్రభుత్వం వారి వారి రాష్ట్రాలను హెచ్చరించింది. వలస కార్మికులు సొంత ఊళ్లలోకి వెళ్తున్న క్రమంలో వైరస్ ఎక్కువయ్యే ప్రమాదముందని కావున ఎక్కడి వారిని అక్కడే నిలిపి వేయాలని ఆదేశించింది. ఇది ఇలాఉంటే ఇప్పటివరకు కరోనా వైరస్ బారిన పడిన వారు కోలుకుంటున్నారు. ఈ విషయంలో గెలుపు మనదేనని భావిస్తున్నారు. లాక్ డౌన్ అనేది ప్రజల సంరక్షణ కోసం అని ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పదని ప్రధానమంత్రి మోదీ తెలిపారు.

 

కాబట్టి లాక్ డౌన్ పోరాటానికి అందరు సహకరించాలని అయన కోరారు. ప్రస్తుత మన దేశ కోవిడ్-19 భాదితుల సంఖ్య 1,100 గా ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రోజు 130 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు నమోదయిన కేసులలో ఆదివారం నమోదయిన కేసులు ఎక్కువగా ఉన్నాయి. కేరళలో 19 కేసులు, మహారాష్ట్రలో 16 కేసులు ఆదివారం కొత్తగా నమోదయ్యాయి. దీంతో కేరళలో మొతం కేసుల సంఖ్య 202 గా ఉంది. మహారాష్ట్రలో 203 కి చేరింది. అన్నిటిని కలిపితే దేశ కరోనా బాధిత సంఖ్య 1139కి చేరింది. ఈ మొత్తం బాధితులలో 103 మంది కోలుకోగా, 27 మంది మృతిచెందారు.

 

తెలంగాణాలో కూడా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పింది. ఆదివారం ఒక కేసు నమోదయింది. తెలంగాణాలో మొత్తం కేసుల సంఖ్య 70కి చేరుకుంది. ఈ మొత్తంలో 11 మంది కోలుకున్నారని, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇక ఏపీలోనూ ఆదివారం ఇద్దరికీ పాజిటివ్ వచ్చింది. మొత్తంగా కేసుల సంఖ్య 21కి చేరింది. విశాఖలో మరో 2 కేసులు నిర్ధారణ అయినట్టు అధికారులు వెల్లడించారు. ఆదివారం ఒక్కరోజు 85 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో 83 మందికి నెగటివ్‌ వచ్చింది. ఢిల్లీలో మత కార్యక్రమానికి ఏపీ నుంచి 500 మంది వెళ్లారు. అక్కడ నుంచి తిరిగొచ్చినవారిలో కరోనా సోకింది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఇలాంటి కేసులు బయటపడ్డాయి.

 

రాష్ట్రాల వారీగా మరణ సంఖ్య మహారాష్ట్ర 7, గుజరాత్ 5, కర్ణాటకలో 3, మధ్యప్రదేశ్ 2, ఢిల్లీ 2, రాజస్థాన్ 1, కేరళ, జమ్మూ కశ్మీర్ తెలంగాణ, పశ్చిమ్ బెంగాల్, పంజాబ్‌లో ఒక్కొక్కరు వైరస్ వలన చనిపోయారు. దేశం మొత్తంలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ మొత్తంగా 1,100 కేసులు నమోదయ్యాయి. వీరిలో 59 మంది విదేశీయులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

https://tinyurl.com/NIHWNgoogle

 

https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: